గెట్‌ రెడీ: ఎ.ఆర్‌.రెహమాన్‌ 'ది జర్నీ' ప్రత్యేకతలివే

- January 23, 2018 , by Maagulf

దుబాయ్:జనవరి 26న భారత రిపబ్లిక్‌ దినోత్సవం. ఇదే రోజున యూఏఈలో భారత దేశానికి చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌ మ్యూజికల్‌ ఈవెంట్‌ బాలీవుడ్‌ పార్క్స్‌ - దుబాయ్‌ - కాన్సెర్ట్‌ ఎరీనాలో జరగబోతోంది. ఎన్నో ప్రత్యేకతలు ఈ మ్యూజికల్‌ ఈవెంట్‌ సొంతం. ఇంకెందుకు ఆలస్యం, టిక్కెట్స్‌ అందుబాటులో ఉన్నాయ్‌. మ్యూజిక్‌ లెజెండ్‌గా చిన్న వయసులోనే పేరు తెచ్చుకున్న రెహమాన్‌, సంగీత ప్రవాహంలో మునిగి తేలడానికి సిద్ధం కావాల్సిందే. రెహమాన్‌ మ్యూజికల్‌ ఈవెంట్‌ ప్రత్యేకతల విషయానికొస్తే.. 
1. 25 ఏళ్ళ మ్యూజికల్‌ జర్నీని పూర్తి చేసుకున్నారు ఎ.ఆర్‌.రెహమాన్‌. తన సంగీత యానంలో ఆస్కార్‌, గ్రామీ పురస్కారాల్ని సొంతం చేసుకున్న రెహమాన్‌తోపాటుగా, బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ సింగర్స్‌ నీతి మోహన్‌, అర్మాన్‌ మాలిక్‌, హర్షదీప్‌ కౌర్‌, జావెద్‌ అలి, బెన్నీ దయాల్‌, జోనితా గాంధీ, కెబా జెర్మయా, హరిచరణ్‌ శేషాద్రి, మరికొందరు సీక్రెట్‌ గెస్ట్స్‌ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 
2. దుబాయ్‌ ట్రాఫిక్‌ ఆహూతుల్ని ఇబ్బంది పెట్టకుండా, నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సిటీ వాక్‌ 2, జఫిలియా మెట్రో స్టేషన్‌, ఐబిఎన్‌ బత్తుతా మాల్‌ నుంచి షటిల్‌ బస్‌లు అందుబాటులో ఉంటాయి. సాయంత్రం 4 గంటల నుంచి ఇవి రన్‌ అవుతాయి. టిక్కెట్‌ ఉన్నవారికి కరీమ్‌ సర్వీసెస్‌పై డిస్కౌంట్‌ అందిస్తున్నారు. ఈ ఈవెంట్‌ కోసం 10,000 కార్లకు సరిపడా పార్కింగ్‌ ఏర్పాట్లు జరిగాయి. 3 గంటల ముందుగా అంటే 6 గంటలకు గేట్స్‌ ఓపెన్‌ చేస్తారు. దాదాపు 20,000 మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. 
3. కార్యక్రమం ఆడియో విజువల్‌ ఫీట్‌గా ఉండబోతోంది. 320 అడుగుల స్టేజ్‌ చూపరులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దబోతోంది. లైటింగ్‌ ఎఫెక్ట్స్‌ విషయంలో ఇంతవరకూ ఎక్కడా జరగని విధంగా ఏర్పాట్లు చేశారు. 
4. స్థానిక అభిమానుల కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన పాటలు ఇక్కడ తమ అభిమాన సింగర్స్‌ ఆలపించనుండడంతో, ఆహూతుల ఆనందానికి ఆకాశమే హద్దు. 
5. డై హార్డ్‌ ఫ్యాన్స్‌ కోసం, 4000 దిర్హామ్‌లతో వివివిఐపి సీట్లు ఏర్పాటు చేయబడ్డాయి. మొదటి 25 టిక్కెట్లు కొనుగోలు చేసినవారికి, లెజెండ్‌ రెహమాన్‌ని స్వయంగా కలిసే అవకాశం ఉంది. వివిఐపి టిక్కెట్‌ హోల్డర్స్‌కి లిమిటెడ్‌ ఎడిషన్‌ వినైల్‌ రికార్డ్‌ - ఎ.ఆర్‌.రెహమాన్‌ హిట్స్‌తో కూడినది అందుతుంది. ప్రీమియమ్‌ ప్లాటినం టిక్కెట్స్‌ కేవలం 20 మీటర్ల దూరంలో ఉంటుంది స్టేజ్‌ నుంచి. తొలి 400 మందికి, ది జర్నీ ఆఫ్టర్‌ పార్టీలో సెలబ్రిటీలతో కలిసి పాల్గొనేందుకు వీలు కల్పిస్తున్నారు. టిక్కెట్లు, ఇతర వివరాల కోసం దుబాయ్‌ పార్క్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ వెబ్‌సైట్‌ని స్పందించగలరు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com