సేమియా తో చికెన్ బిర్యానీ
- January 26, 2018కావలసిన పదార్థాలు : సేమియా-అర కేజి, నిమ్మకాయ-1, చికెన్-అర కేజి, పచ్చిమిర్చి-10గ్రా, దాల్చిన చెక్క-1, లవంగాలు-6, ఉల్లిపాయలు-2, నూనె-తగినంత, కొత్తిమీర-6 రెబ్బలు, అల్లంవెల్లుల్లి ముద్ద-20గ్రా, ఉప్పు-తగినంత, బిర్యానీ ఆకు-10గ్రా, యాలకులు-2, జీడిపప్పు-200గ్రా, పసుపు-చిటికెడు.
తయారుచేయు విధానం : ముందుగా స్టవ్‌పై గిన్నె ఉంచి అందులో నాలుగు గ్లాసుల నీళ్ళు పోయాలి. అందులో సేమియా వేసి, ఒక స్పూను నిమ్మరసం, ఒక స్పూను నూనె వేసి అయిదు నిమిషాలు ఉంచి దించేయాలి. తడి బట్ట తీసుకుని ఉడికిన సేమియాను అందులో వేసి వడగట్టాలి. నీరంతా పోయిన తర్వాత సేమియాను ఒక ప్లేటులోకి తీసి పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్‌పై మరో గిన్నె ఉంచి, కొద్దిగా నూనె వేసి, శుభ్రంగా కడిగి ఉంచుకున్న చికెన్ ముక్కలను అందులో వేసి చిన్న మంటపై అయిదు నిమిషాలు ఉడికించాలి. లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, పసుపు అన్ని కలిపి మిక్సీలో వేసి పొడి చేసి పెట్టుకోవాలి. ఈ పొడి చికెన్‌పై చల్లి, అల్లంవెల్లుల్లి ముద్ద కూడా అందులో వేసి బాగా కలపాలి. చిన్న మంటపై మరో అయిదు నిమిషాలు చికెన్‌ను ఉడికించి, ఆపైన సేమియా కూడా వేసి మళ్ళీ బాగా కలపాలి. ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు, కొత్తిమీర ఆకులు, బిర్యానీ ఆకు, జీడిపప్పు వేసి బాగా కలిపి దించేయాలి. అంతే- సేమియా చికెన్ బిర్యానీ రెడీ అయినట్లే.
తాజా వార్తలు
- జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ బ్యాగులపై నిషేధం
- 2025-26 నాటికి ఇంటింటికి ఎగిరే కార్లు..!
- బహ్రెయిన్ సమ్మిట్‌కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్‌కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్‌తో మోదీ