కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జనవరి 2018 ట్రాఫిక్ గణాంకాలు

కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో  జనవరి  2018 ట్రాఫిక్ గణాంకాలు

కువైట్: జనవరి 2018 నాటికి  అంతర్గత వ్యవహారాల శాఖ, సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ గణాంకాల  ప్రకారం, 2,171,961 మంది ప్రయాణికులు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రాయం నుంచి వెలుపల ప్రాంతాలకు ప్రయాణమయ్యారు. అదేవిధంగా  536,142  మంది కేవలం గల్ఫ్ దేశాల సమాఖ్యకు చెందిన పౌరులు ఈ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించారు. అలాగే ఇక్కడకు వస్తున్నా పౌరులు సంఖ్య 922,433 చేరుకుంది. ఇంతలో, ఇతర దేశాలకు చెందిన ప్రయాణికుల సంఖ్య 759,619 చేరుకుంది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద జారీ చేసిన వీసాల సంఖ్య 14,319 మంది.  వేలిముద్రల ఆధారంగా 85 మంది గతంలో కువైట్ దేశం నుంచి బహిష్కరించబడ్డ వారని ఈ సందర్భంగా గుర్తించారు. ఐదుగురు వ్యక్తులు నకిలీ పాస్పోర్ట్ లతో అరెస్టు కాబడ్డారు. 112 మందిని  సంబంధించిన అధికారుల వద్దకు పంపబడ్డారు. అదేవిధంగా గతంలో దేశ బహిష్కరణకు గురైన  పదిహేను మందిని నిబంధన కాలం ముగిసిన తరువాత కువైట్ దేశంలోకి అనుమతించబడ్డారు, మరో 11 మందిని దేశంలోకి ప్రవేశించడానికి అధికారులు అనుమతించలేదు.

Back to Top