ఇజ్రాయిల్ ప్రయోజనాలేంటి! అమెరికా ప్రసిడెంట్ ట్రంప్

ఇజ్రాయిల్ ప్రయోజనాలేంటి! అమెరికా ప్రసిడెంట్ ట్రంప్

ఇజ్రాయిల్ ప్రయోజనాలేంటి! అ- వెస్ట్‌ బ్యాంక్‌ ఆవాసాల నిర్మాణాలపై ట్రంప్‌ ఖండన 
జెరూసలేం:పాలస్తీనాతో శాంతిని కోరుకోవడంలో ఇజ్రాయిల్‌ ప్రయోజనాలు ఏమిటని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రశ్నించారు. ఇజ్రాయిల్‌ హేయమ్‌ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ మాట్లాడుతూ, ఒప్పందం కుదుర్చుకోవాలని పాలస్తీనా ఆకాంక్ష పట్ల కూడా సందేహం వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్‌తో సత్సంబంధాలు నెరుపుతూ మరో పక్క పాలస్తీనాతో బహిరంగంగానే ఘర్షణ పడే అమెరికా అధ్యక్షుడు ఇజ్రాయిల్‌పై ఇటువంటి విమర్శ చేయడం చాలా అరుదు. ఇప్పటికైతే పాలస్తీనియన్లు శాంతి స్థాపన కోసం ఎదురుచూడడం లేదని, ఇజ్రాయిల్‌ అలా ఎదురుచూస్తుందని తాము అనుకో వడం లేదని అన్నారు. కాబట్టి ఏం జరుగుతుందో చూడడం ప్రస్తుతం మనం చేయాల్సిన పనని ఆయన వ్యాఖ్యానించారు. అయితే అమెరికా శాంతి ప్రణాళిక ఏమిటన్న వివరాలు ట్రంప్‌ వెల్లడించలేదు. పైగా ఆక్రమిత వెస్ట్‌ బ్యాంక్‌లో ఇజ్రాయిల్‌ ఆవాసాలను నిర్మించడాన్ని కూడా ట్రంప్‌ విమర్శించారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే ట్రంప్‌ హయాంలో ఇజ్రాయిల్‌ అక్రమ ఆవాసాల నిర్మా ణాన్ని ఖండనలు తక్కువే.

'ఆ ఆవాసాల నిర్మాణం చాలా క్లిష్టంగా మారింది. దాంతో శాంతి ప్రయత్నాలకు కూడా ఇబ్బంది కలుగుతోంది. కాబట్టి ఇజ్రాయిల్‌ ఈ విషయంలో కాస్తంత జాగ్రత్తగా వుండాలి' అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. జెరూసలేంను ఇజ్రాయిల్‌ రాజధానిగా గుర్తిస్తూ ట్రంప్‌ ప్రకటించిన నాటి నుండి అమెరికా, పాలస్తీనా మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి.

పైగా పాలస్తీనా శరణార్థుల వ్యవహారాలు చూసే ఐరాస నిధుల్లో కోత కూడా విధించారు. ఇజ్రాయిల్‌తో చర్చలు పునరుద్ధరిస్తేనే సాయం అందిస్తామని షరతు విధించారు.మెరికా ప్రసిడెంట్ ట్రంప్ 

Back to Top