జలాంతర్గామి మరమ్మతులకు రూ.125 కోట్లు అడుగుతున్న రష్యా

జలాంతర్గామి మరమ్మతులకు రూ.125 కోట్లు అడుగుతున్న రష్యా

ఢిల్లీ : దెబ్బతిన్న ఐఎన్‌ఎస్‌ చక్ర జలాంతర్గామి మరమ్మతులకు రష్యా 20 మిలియన్‌ డాలర్లు(సుమారు రూ.125 కోట్లు) అడుగుతున్నట్లు సమాచారం. ఈ జలాంతర్గామి రేవులోకి ప్రవేశిస్తుండగా ప్రమాదానికి గురై దెబ్బతిన్న విషయం గత ఏడాది అక్టోబరులో వెలుగు చూసింది. 2012 ఏప్రిల్‌ 12న ఈ నూక్లియర్‌ జలాంతర్గామిని మన నౌకదశంలో ప్రవేశపెట్టారు. ప్రమాదానికి బాధ్యులను గుర్తించడానికి కేంద్రం యత్నిస్తోంది. అలాగే మరమ్మతులు చేయించేందుకూ చర్యలు చేపడుతోంది.

Back to Top