50 శాతం జరీమానా తగ్గింపు: 2 వారాలు మాత్రమే

50 శాతం జరీమానా తగ్గింపు: 2 వారాలు మాత్రమే

అబుదాబీలో ట్రాఫిక్‌ జరీనామాల తగ్గింపు గడువు ఇంకో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటిదాకా ఎవరైనా తమ జరీమానాల్ని క్లియర్‌ చేసుకోనట్లయితే, చివరి రోజు వరకు ఎదురుచూడకుండా, మిగిలి వున్న 16 రోజుల్లో వీలైనంత త్వరగా వాటిని క్లియర్‌ చేసుకోవడం మంచిది. మార్చి 1తో ఈ డిస్కౌంట్‌తో కూడిన జరీమానాల చెల్లింపు గడువు ముగుస్తుంది. గత ఏడాది డిసెంబర్‌ 2న ఈ ఆఫర్‌ ప్రకటితమయ్యింది. 2016 ఆగస్ట్‌ 1 నుంచి 2017 డిసెంబర్‌ 1 వరకు నమోదైన ట్రాఫిక్‌ జరీమానాలకు ఈ తగ్గింపు వర్తిస్తుంది. ట్రాఫిక్‌ అండ్‌ పెట్రోల్స్‌ డైరెక్టరేట్‌ డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ ఖలీఫా మొహమ్మద్‌ అల్‌ ఖైల్‌ మాట్లాడుతూ ఈ అవకాశాన్ని వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మార్చి 1 లోగా చెల్లించకపోతే, మార్చి 1 తర్వాత జరీమానాలు ఎలాంటి డిస్కౌంట్‌ లేకుండా చెల్లించాల్సి ఉంటుంది. వాహనదారులు తమ వాహనాల్ని నిబంధనలకు లోబడి నడిపితే జరీమానాల సమస్య వుండదని ఆయన చెప్పారు. డిసెంబర్‌ 1న యూఏఈ నేషనల్‌ డే సందర్భంగా అబుదాబీ క్రౌన్‌ ప్రిన్స్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌, ట్రాఫిక్‌ జరీమానాలపై 50శాతం డిస్కౌంట్‌ని ప్రకటించారు.

Back to Top