ఉల్లంఘన: 562,961 మంది వలసదారుల అరెస్ట్‌

ఉల్లంఘన: 562,961 మంది వలసదారుల అరెస్ట్‌

రియాద్‌: మొత్తం 562,691 మంది వలసదారుల్ని గత ఏడాది నవంబర్‌ 1 నుంచి ఇప్పటిదాకా అరెస్ట్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. సౌదీ లేబర్‌ మరియు రెసిడెన్సీ అలాగే బోర్డర్‌ సెక్యూరిటీ చట్టాల్ని ఉల్లంఘించినందుకుగాను వీరిని అరెస్ట్‌ చేశారు. 'ఎ నేషన్‌ వితౌట్‌ వయొలేటర్స్‌' నినాదంతో దేశవ్యాప్తంగా చేపట్టిన క్యాంపెయిన్‌లో ఉల్లంఘనుల్ని గుర్తించి, అరెస్ట్‌ చేశారు. ఇందులో 382,921 మంది వద్ద చెల్లుబాటయ్యే రెసిడెన్సీ పర్మిట్‌ లేదు. 127,566 మంది వద్ద సరైన వర్క్‌ పర్మిట్‌ లేదు. 62,204 మంది బోర్డర్‌ సెక్యూరిటీ సిస్టమ్‌కి సంబంధించిన ఉల్లంఘనలకు పాల్పడ్డారు. అక్రమంగా సౌదీలోకి ప్రవేశించేందుకు యత్నించిన 7,996 మందిని అరెస్ట్‌ చేశారు. ఇందులో 69 శాతం యెమనీయులు ఉండగా, 29 మంది ఇథియోపియన్స్‌ ఉన్నారు. 2 శాతం మంది ఇతర దేశాలకు చెందినవారున్నారు. కింగ్‌డమ్‌ నుంచి పారిపోయేందుకు యత్నించిన 501 మందిని అరెస్ట్‌ చేశారు. అక్రమంగా దేశంలో నివసిస్తున్నవారే అనేకరకాలైన నేరాలకు పాల్పడుతున్నట్లు రియాద్‌ పోలీసు అధికారులు చెబుతున్నారు. 

Back to Top