మెటల్‌ నట్‌లో ఇరుక్కున్న బాలుడి వేలు

- February 22, 2018 , by Maagulf
మెటల్‌ నట్‌లో ఇరుక్కున్న బాలుడి వేలు

రస్‌ అల్‌ ఖైమా సివిల్‌ డిఫెన్స్‌ టీమ్‌, అత్యంత చాకచక్యంగా 13 ఏళ్ళ చిన్నారి వేలిని కాపాడింది. మెటల్‌ నట్‌లో ఇరుక్కుపోయిన ఆ చిన్నారి వేలిని ఎలాంటి ప్రమాదం లేకుండా రక్షించగలిగారు రెస్యూ టీమ్‌. బుధవారం రాత్రి ఆ బాలుడ్ని అతని బంధువులు తీసుకొచ్చారనీ, ఫైర్‌ ఫైటర్స్‌ ఎంతో జాగ్రత్తగా వ్యవహరించి, ఆ బాలుడ్ని రక్షించారని యూఏఈ సివిల్‌ డిఫెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ మొహమ్మద్‌ అబ్దుల్లా అల్‌ జాబి చెప్పారు. ముందుగా వారు ఓ ఆసుపత్రికి తరలించగా, సివిల్‌ డిఫెన్స్‌ వద్దకు వెళ్ళమని ఆసుపత్రి సిబ్బంది సూచించినట్లు ఆయన వివరించారు. ఇలాంటి కేసుల్ని డీల్‌ చేయడానికి ప్రత్యేకమైన ఎక్విప్‌మెంట్‌, అలాగే ట్రైనింగ్‌ అవసరమని వివరించారాయన. ఎలక్ట్రానిక్‌ కట్టర్‌ని వినియోగించి మెటల్‌నట్‌ని కత్తిరించి, చిన్నారి వేలిని కాపాడారు. ప్రమాదకరమైన వస్తువులను పిల్లలకు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com