మునక్కాయ, మటన్ దాల్చ
- March 08, 2018కావలసిన పదార్థాలు: మసూరి దాల్ (ఎర్రపప్పు) - 100 గ్రా., శనగపప్పు - 50 గ్రా., ఆవాలు - 5 గ్రా., లవంగాలు - 2, దాల్చినచెక్క - అంగుళం ముక్క, వెల్లుల్లి - 10 గ్రా., మటన్ - అరకేజి, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, ఉల్లిపాయలు - 2, కరివేపాకు - 4 రెబ్బలు, పచ్చిమిర్చి - 10, మునక్కాయలు - 2, పుదీనా - 1 కట్ట, ఆమ్కా చూర్ - 10 గ్రా., కారం - అర టీ స్పూను, పసుపు - పావు టీ స్పూను, నెయ్యి - 50 గ్రా., ఉప్పు - రుచికి తగినంత, మటన్ స్టాక్ - అర లీటరు.
తయారుచేసే విధానం: మసూరి, శనగపప్పులను ఒక గంటసేపు నానబెట్టాలి. నూనెలో అల్లం వెల్లుల్లి పేస్టు వేగించి మటన్, నానిన పప్పులు, స్టాక్ వేసి మెత్తగా ఉడికించాలి. మరో కడాయిలో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, లవంగాలు, దాల్చిన చెక్క, కరివేపాకు, మునక్కాయ (రెండు అంగుళాల) ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలు వేగించాలి. మునక్కాయలు మెత్తబడ్డాక ఉడికించిన మటన్, పప్పుల మిశ్రమాన్ని కలిపి తగినంత ఉప్పు వేసి రెండు నిమిషాల తర్వాత ఆమ్కా చూర్, పుదీనా, నెయ్యి కలిపి దించేయాలి. ఈ దాల్చా బిర్యాని రైస్‌తో ఎంతో రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ