రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని కోసం అత్యాధునిక విమానాలు

- March 12, 2018 , by Maagulf
రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని కోసం అత్యాధునిక విమానాలు

న్యూఢిల్లీ : భారత రాష్ట్రపతి, ప్రధానిలకు ఇక కొత్త విమానాలు అందుబాటులోకి రానున్నాయి. అత్యుధానిక సదుపాయాలతో ఆ విమానాలను రూపొందిస్తున్నారు. 2020లోగా ఎయిర్ ఇండియా వన్ విమానాలు సర్వీస్‌లోకి వస్తాయి. దీని కోసం బోయింగ్ 777 విమానాలకు అప్‌గ్రేడ్ చేస్తున్నారు. భారత ఉప రాష్ట్రపతికి కూడా మరో ఆధునిక విమానం అందుబాటులోకి రానున్నది. ఈ ఏడాది ఆరంభంలోనే మూడు బోయింగ్ 777లను కొనుగోలు చేశారు. ఆ విమానాలకు కొత్త ఫీచర్లను ఏర్పాటు చేస్తున్నారు. సెక్యూర్టీ సిస్టమ్‌లను మరింత పకడ్బందీగా మారుస్తున్నారు. రెండు బోయింగ్‌లకు మాత్రం వీఐపీ ఎన్‌క్లోజర్‌ను, ప్రెస్ కాన్ఫరెన్స్ రూమ్, మెడికల్ ఎమర్జెన్సీ యూనిట్‌ను తయారు చేస్తున్నారు. ఈ విమానాల్లో వైఫైని కూడా అమరుస్తున్నారు. యాంటీ మిస్సైల్ సిస్టమ్స్, రాడార్ మెకానిక్స్, ఇతర సెక్యూర్టీ ఫీచర్స్ కూడా ఉంటాయి. ఇప్పటి వరకు రాష్ట్రపతి, ప్రధాని కోసం బోయింగ్ 747ఎస్ విమానాలను వాడారు. 777 వల్ల వీవీఐపీ ట్రాన్స్‌పోర్ట్‌లో చాలా మార్పు వస్తుం

ది. ఈ ప్లేన్‌తో నాన్‌స్టాప్‌గా అమెరికా వరకు వెళ్లవచ్చు. అంటే దారిలో రీఫుయలింగ్ ఇక అవసరం ఉండదు. కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా అత్యాధునికంగా ఉంటుంది. వీవీఐపీలకు పరన్సల్ రూమ్‌లు కూడా 

ఉంటాయి. ఈ విమానాలకు రెండు జీఈ90-115బీఎల్ ఇంజిన్లు ఉంటాయి. ప్రస్తుతం ఈ ఇంజిన్లే విమానాలకు అత్యంత శక్తివంతమైనవని భావిస్తున్నారు. త్వరలోనే ఎయిర్ ఇండియా నుంచి ఈ విమానాలను కొనుగోలు చేయనున్నట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com