డ్రగ్స్‌ సరఫరా: నిందితుల అరెస్ట్‌

డ్రగ్స్‌ సరఫరా: నిందితుల అరెస్ట్‌

సౌదీ అథారిటీస్‌, 5 మిలియన్‌ కాప్టగాన్‌ పిల్స్‌, అలాగే టన్ను బరువైన హాషిస్‌ని వేర్వేరు ఆపరేషన్లలో పట్టుకున్నాయి. సదరన్‌, నార్తరన్‌ బోర్డర్స్‌లో వీటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఆపరేషన్‌లో కస్టమ్‌ అధికారులు, హలాత్‌ అమర్‌ నార్త్‌ వెస్టర్న్‌ బోర్డర్‌లో 4,839,000 కాప్టగాన్‌ పిల్స్‌, 349.7 గ్రాముల హాషిస్‌ని ఓ వాహనంలో కనుగొన్నారు. ఈ విషయాన్ని హలాత్‌ అమర్‌ కస్టమ్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఖాలిద్‌ అల్‌ రొమైయా వెల్లడించారు. డోర్స్‌ కావిటీస్‌లోనూ, రిజర్వ్‌ టైర్‌లోనూ, వెహికిల్‌ మాట్రెసెస్‌లోనూ వీటిని నిందితులు అమర్చారు. పైకి కనబడనీయకుండా డ్రగ్స్‌ దాచిన ప్రాంతాల్లో ఐరెన్‌ నెట్‌ని కూడా ఉంచారు నిందితులు. నిందితుల్ని, అలాగే వారు దాచిన డ్రగ్స్‌నీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

 

Back to Top