2021 చివరి నాటికి యూఏఈ - సౌదీ ట్రెయిన్‌

2021 చివరి నాటికి యూఏఈ - సౌదీ ట్రెయిన్‌

సౌదీ అరేబియాతో యూఏఈ ట్రైన్‌ లింక్‌ 2021 నాటికి అందుబాటులోకి రానుందని సీనియర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అధికారి వెల్లడించారు. ఫెడరల్‌ అథారిటీ ఫర్‌ ల్యాండ్‌ అండ్‌ మెరైన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డైరెక్టర్‌ జనరల్‌ అబ్దుల్లా సలెమ్‌ అల్‌ కథిరి మాట్లాడుతూ, 2021 చివరి నాటికి సౌదీ అరేబియాతో యూఏఈకి ట్రైన్‌ లింక్‌ ఏర్పడనుందని చెప్పారు. 2,100 కిలోమీటర్ల పొడవైన ప్యాసింజర్‌ మరియు కార్గో నెట్‌వర్క్‌, మొత్తం ఆరు జిసిసి దేశాల్ని కలుపుతుంది. 2016లోనే యూఏఈ తన భూభాగంలో రైల్‌ నెట్‌వర్క్‌ నిర్మాణాన్ని నిలుపుదల చేసింది. ఒమన్‌ సైతం తమ డొమెస్టిక్‌ నెట్‌వర్క్‌ ఆలోచనల్లో మునిగిపోయింది. లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలతో ఏర్పడ్డ బడ్జెట్‌ డెఫిషినట్స్‌ కారణంగా ఈ రీజియన్‌లో ప్రాజెక్టులు ఆలస్యమయ్యాయి. దాంతో మూడేళ్ళపాటు ఈ రైల్‌ నెట్‌వర్క్‌ పనులు కూడా ఆలస్యం కానున్నాయి.

 

Back to Top