యూఏఈ హైపర్‌ మార్కెట్స్‌లో 50% డిస్కౌంట్‌

యూఏఈ హైపర్‌ మార్కెట్స్‌లో 50% డిస్కౌంట్‌

యూఏఈ రెసిడెంట్స్‌, 50 శాతం డిస్కౌంట్‌ని పొందే అవకాశం మార్చి 20 నుంచి ఏప్రిల్‌ 20 వరకు కలగబోతోంది. కన్స్యుమర్‌ గూడ్స్‌, ఫుడ్‌పై ఈ డిస్కౌంట్‌ వర్తిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్‌ ఎకానమీ, వరల్డ్‌ హ్యాపీనెస్‌ డే సందర్భంగా కో-ఆపరేటివ్‌ ఔట్‌లెట్స్‌, హైపర్‌ మార్కెట్‌ మరియు సూపర్‌ మార్కెట్‌ ఛెయిన్స్‌తో సంయుక్తంగా ఈ ఆఫర్‌ పీరియడ్‌ని రెసిడెంట్స్‌కి అందిస్తోంది. 13వ గల్ఫ్‌ కన్స్యుమర్‌ ప్రొటెక్షన్‌ డే సందర్భంగా మార్చి 1 నుంచి 51 రోజులపాటు ఈ ఆఫర్‌ని పొడిగించినట్లు తెలుస్తోంది. డిస్కౌంట్స్‌లో 7,500 ఐటమ్స్‌లో 3000 కో-ఆపరేటివ్స్‌లో లభ్యమవుతాయి. 2,000 వస్తువులు కేర్‌ ఫోర్‌ మరియు లులు స్టోర్స్‌లో లభ్యమవుతాయి. 

Back to Top