పొట్ట సమస్యల నివారణకు హెల్తీ ఫుడ్స్ ...

- November 30, 2015 , by Maagulf
పొట్ట సమస్యల నివారణకు  హెల్తీ ఫుడ్స్ ...

డైజెస్టివ్ ట్రాక్..జీర్ణవ్యవస్థ ఎంత ఆరోగ్యంగా ఉంటే..మన శరీర ఆరోగ్యం అంత హెల్తీగా ఉంటుంది. హెల్తీ డైజెస్టివ్ సిస్టమ్ వల్ల హెల్తీ బాడీ మరియు హెల్తీ మైండ్ కలిగి ఉంటారు. ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో జీవనశైలిలో అనేక మార్పుల వల్ల చాలా మంది స్టొమక్ అప్ సెట్, అజీర్తి, మలబద్దకం మరియు ఇతర గ్యాస్ట్రోఇన్టెన్షినల్ సమస్యలతో బాధపడుతుంటారు . ముఖ్యంగా మనం తీసుకొనే ఆహారంలో ఫైబర్ లేకపోవడం మరియు రీఫైండ్ కార్బోహైడ్రేట్స్ ను మరియు మైదాను ఎక్కువగా తీసుకోవడం వల్ల మన జీర్ణవ్యవస్థను మరింత బలహీనంగా మార్చుతుంది. దాంతో మలబద్దకానికి కారణం అవుతుంది. మన జీర్ణక్రియ బాగుండాలంటే సాధ్యమైనంత వరకూ ఫైబర్ ఫుడ్స్ ను అధికంగా తీసుకోవడం మంచిది. అయితే కొంత మంది ఫైబర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కడుపుబ్బరం, స్టొమక్ గ్యాస్ మరియు ఆపానవాయువు సమస్యల వల్ల ఫైబర్ ఫుడ్స్ ను తీసుకోలేకపోతున్నామని చెబుతుంటారు.అసిడిక్ రిఫ్లెక్షన్ వల్ల వచ్చే కడుపునొప్పికి ఉపశమనం కలిగించే నేచురల్ రెమెడీస్ అలాంటి వారి కోసం, వారి జీర్ణక్రియ మెరుగ్గా ఉండటం కోసం కొన్ని ప్రత్యేకమైన ఫైబర్ ఫుడ్స్ ను ఈ క్రింది లిస్ట్ లో తెలపడం జరిగింది. ఈ ఫుడ్స్ లో ఫైబర్ అధికంగా, షుగర్స్ తక్కువగా ఉంటాయి. ఇవి పొట్ట సమస్యలకు గురి చేయకుండా జీర్ణవ్యవస్థను ఆరోగ్యాంగా మెరుగుపరుస్తాయి. ఈ క్రింది లిస్ట్ ఆఫ్ ఫుడ్స్ లోని ప్రత్యేకమైన ఆహారాల వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. కడుపుబ్బరం, గ్యాస్ సమస్యలుండవు. ఈ ఆహారాలు ఎలాంటి జీర్ణ సంబంధిత సమస్యలు లేకుండా సహాయపడుతాయి. మరి స్టొమక్ ట్రబుల్స్ అన్నింటిని ఎఫెక్టివ్ గా బీట్ చేసి ఆహారాలేంటో ఈ క్రింది లిస్ట్ ద్వారా తెలుసుకుందా హెల్తీ డైజెస్టివ్ ట్రాక్ ను మెయింటైన్ చేయడానికి పెరుగు గ్రేట్ గా సహాయపడుతుంది . ఇందులో మంచి బ్యాక్టీరియా లేదా ప్రోబయోటిక్స్ కలిగి ఉంటాయి . ఇవి తిన్న ఆహారంను పూర్తిగా జీర్ణం అయ్యేలా చేసి న్యూట్రీషియన్స్ శరీరంలో షోషింపబడేందుకు సహాయపడుతుంది . ఇది పొట్ట సమస్యలు మరియు పొట్ట ఉదర సమస్యలున్న వారికి ప్రత్యేకంగా సిఫారస్సు చేయబడినటువంటి ఆహారం. బ్రౌన్ రైస్ లో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు మొత్తం జీర్ణవ్యవస్థనే మరింత ఎఫెక్టివ్ గా పనిచేసేందుకు సహాయపడుతుంది. అలాగే బ్రౌన్ రైస్ డైజెస్టివ్ సిస్టమ్ లోని టాక్సిన్స్ ను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ముఖ్యంగా మలబద్దకం మరియు హెమరాయిడ్స్ తో బాధపడే వారికి ఇది ఉపయోగకరమైనది. అనేక రకాల పొట్ట సమస్యలను నివారించడంలో జ్యూచిని గ్రేట్ గా సహాయపడుతుంది. దీన్ని సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది గ్యాస్ మరియు ఆపానవాయువకు కారణం కాదు. ఇది ప్రేగులను శుభ్రం చేసి కోలన్ క్యాన్సర్ ను నివారిస్తుంది. కివి ఫ్రూట్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది షుగర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. మరియు ఇది కడుపుబ్బరం మరియు గ్యాస్ ను నివారిస్తుంది. కివి ఫ్రూట్స్ ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతాయి. ముఖ్యంగా డయాబెటిక్ వారికి చాలా మేలు చేస్తుంది. కివి పండులో న్యూట్రీషియన్స్ అధికంగా ఉండటం వల్ల డైజెషన్ ప్రొసెస్ ను ప్రోత్సహిస్తుంది. గ్రీన్ లీఫి వెజిటేబుల్స్ లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు చాలా ఉపయోగకరమైనది . ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది . ఇది బౌల్ మూమెంట్ యొక్క ప్రెజర్ ను పెంచుతుంది . మలబద్దకం మరియు రక్తహీనత నివారించడంలో ఇది ఒక బెస్ట్ ఫుడ్. ఇంకా హెమరాయిడ్స్ కూడా నివారిస్తుంది. ఇదిఒక ఫార్మేటెడ్ ఫుడ్. పులియబెట్టడం వల్ల ఇందులో మంచి బ్యాక్టీరియా ఉంంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు కడుపుబ్బరాన్ని నివారిస్తుంది . దీనితో పాటు పికెల్, వంటి ఫార్మేటెడ్ ఫుడ్స్ ను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ప్రూనే పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రెగ్యురల్ బౌల్ మూమెంట్ కు సహాయపడుతుంది. కాబట్టి జీర్ణక్రియ మెరుగుపరుచుకోవడానికి ప్రూనే పండ్లును రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇవి మన శరీరంలోని టాక్సిన్స్ ను ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది. మరో సర్ప్రైజింగ్ స్నాక్ . జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది. పొటాటో చిప్స్ కు బదులుగా హెల్తీ పాప్ కార్న్ తినడం వల్ల మన శరీరానికి అవసరం అయ్యే ఫైబర్ ను పుష్కలంగా పొందవచ్చు . మూడు కప్పుల పాప్ కార్న్స్ లో మూడు గ్రాముల ఫైబర్ లభ్యం అవుతుంది. బీన్స్ లో ఎక్కువ ఫైబర్ కటెంట్ ఉంటుంది. ఇది క్యాలరీలను కరిగిస్తుంది మరియు గ్యాస్ సమస్యతో బాధపడే వారికి ఇది ఒక ఎఫెక్టివ్ హోం రెమెడీ. బీన్స్ పొట్ట నిండినట్లు భావన కల్పిస్తుంది. ఎక్కువ సమయం ఆకలి కానివ్వదు. దాంతో మలబద్దకం నివారించబడుతుంది. సాల్మన్ లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. మరియు ఇది జీర్ణక్రియ మెరుగుదలకు చాలా మేలు చేస్తాయి. సాల్మన్ ఫిష్ బాడీ ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎవరైతే సాల్మన్ ఫిష్ ను రెగ్యులర్ గా తింటారో వారిలో ఎలాంటి జీర్ణ సమస్యలుండవు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com