కుర్దు ప్రాంతాలపై టర్కీ సైన్యం దాడులు

- March 18, 2018 , by Maagulf
కుర్దు ప్రాంతాలపై టర్కీ సైన్యం దాడులు

ఆఫ్రిన్‌ : సిరియాలోని కుర్దు ప్రాబల్య ప్రాంతాలపై టర్కీ సైన్యం దాడుల్ని తీవ్రతరం చేసింది. ఆఫ్రిన్‌ నగరంలో టర్కీ సేనలు పాగా వేశాయి. టర్కీ సైన్యం అండదండలతో సిరియాలో పోరాటం సాగిస్తున్న ప్రయివేటు సేనలు ఈ నగరంలోని కుర్దులను వెళ్లగొడుతున్నాయి. అనంతరం ప్రముఖ కుర్దు నాయకుడి విగ్రహాన్ని సేనలు నేలకూల్చాయి. తమ దేశ సరిహద్దుల్లో ఉన్న కుర్దిష్‌ మిలిటెంట్లను అంతమొందించేందుకు గత రెండు నెలలుగా సిరియాలో దాడులు జరుపుతున్నామని టర్కీ సైన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. 

అయితే, ఈ దాడుల్లో ఇప్పటివరకూ 280 సాధారణ పౌరులు మరణించారని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాగా ఆ ఆరోపణలను టర్కీ ఖండించింది. దీనికంటే ముందు, 'ఫ్రీ సిరియా ఆర్మీ' సేనలు ఆఫ్రిన్‌ నగరాన్ని ఆదివారం ఉదయం స్వాధీనం చేసుకున్నాయని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ ప్రకటించారు. సేనల దెబ్బకు ఉగ్రవాదులు ఒట్టి చేతులతో పారిపోతున్నారని ఆయన అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com