ఇంట్లో అక్రమ సౌందర్య శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్న ఓ మహిళ

- March 18, 2018 , by Maagulf
ఇంట్లో అక్రమ సౌందర్య శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్న ఓ మహిళ

దుబాయ్: ' అందం మోసకరం....సౌందర్యం వ్యర్ధమైనప్పటికీ '... ప్రపంచవ్యాప్తంగా ఏటా కొన్ని వేల కోట్ల వ్యాపారం సౌందర్య సాధనాల కోసం పలువురు ఖర్చు పెడుతుంటారు. అందాలను మెరుగుపర్చుకొనేందుకు కొందరు కృత్రిమ సౌందర్య పద్దతులను సైతం ఆశ్రయిస్తారు. వీరి బలహీనతను ఆసరాగా చేసుకొని కొందరు అందాలను మెరుగుపరుస్తామంటూ మిడి మిడి జ్ఞానంతో సౌందర్య కుటీర పరిశ్రమలు ఏర్పాటుచేసుకొంటూ అధికంగా ఆదాయాలను సంపాదిస్తున్నారు. దుబాయిలో ఒక మహిళ ఒక అడుగు ముందుకేసి అక్రమంగా కాస్మటిక్ సర్జరీలు ఎడాపెడా చేసి పారేస్తోంది. తన చికిత్సలో ఏదైనా బెడిసికొడితే..ఎదుటివారి అందమే కదా వికారమయ్యెదనే సిద్ధాంతంతో ఇంట్లో కాస్మటిక్ సర్జరీలు నిర్వహిస్తుంది. ఈ అక్రమ శస్త్ర చికిత్సలపై         దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పందించింది  ఆమె వినియోగిస్తున్న అక్రమ మందులను ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఆ మహిళను  దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ దుర్వినియోగదారుల కోర్టు ఎదుటకు ప్రస్తావించారు.   దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ద్వారా బురు దుబాయ్ ప్రాసిక్యూటర్ మిత్రా ఇబ్రహీం మదాని తెలిపిన వివరాల  ప్రకారం, ఈ కేసులో ప్రతివాది " సౌందర్య ఉత్పత్తులు, సిరంజిలు మరియు మందులు" ఉపయోగించి ఆమె వద్దకు వచ్చే రోగులకు సౌందర్య శస్త్రచికిత్సలు నిర్వహించారు. లైసెన్స్ లేకుండా ఈ వైద్యురాలు ఒక మహిళ నుంచి 1,000 ధిర్హాంలు తీసుకొని ఆమెకు పెదవులు ఉబ్బెత్తుగా ఉండి తాజాగా మెరుస్తూ ఉండేలా ఒక ఇంజక్షన్ చేస్తూ ఆకస్మికంగా పోలీసులకు నేరుగా పట్టుబడింది. తరువాత, ఆమెకు  లైసెన్స్ లేకుండా వైద్యం చేస్తున్నారనే ఆరోపణలపై దుర్వినియోగదారుల న్యాయస్థానం ఎదుటకు పంపించారు. ఆమె వద్ద ఉన్న వైద్య యంత్రాలను, వివిధ ఉపకరణాలను స్వాధీనం చేసుకొన్నారు.  సౌందర్యం మెరుగుపర్చి ఔషధమును అభ్యసించటానికి అనుమతినిచ్చారు. న్యాయవాదులు తనకు చట్టబద్దమైన గరిష్ట శిక్షణను పొందాలనే  సిఫార్సును  ఆమెను సూచించారు. న్యాయవాది మిత్రా సరైన మార్గాల ద్వారా వెళ్ళకుండా కాస్మిటిక్ సర్జరీలు నేర్చుకోవడం మంచిది కాదని తెలిపారు. ఆరోగ్య చట్టాలు  అమలు చేయకుండా సొంత వైద్యం ప్రజల ప్రాణాలను ప్రమాదానికి గురిచేస్తాయి. అటువంటి అక్రమ ప్రాంతాలకు వెళ్లేవారికి చట్టబద్ధంగా బాధ్యత వారికి వారే వహించాలని ప్రజలను కోర్టు హెచ్చరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com