సింగపూర్ లో వైభవోపేతంగా ఉగాది సంబరాలు

- March 19, 2018 , by Maagulf

సింగపూర్:శ్రీ  విలంబ నామ సంవత్సరం లో తొలి తెలుగు పండుగ “ఉగాది” వేడుకలు సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో స్థానిక సెరంగూన్ రోడ్ లోని శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయం యందు వైభవోపేతంగా నిర్వహించబడ్డాయి. ఉగాదిని పురస్కరించుకొని, రాబోవు సంవత్సరంలో అందరికీ మంచి జరగాలననే సంకల్పంతో , తిరుమల తరహా లో  కన్నుల విందుగా జరుపబడిన సుప్రభాతసేవ,తోమాలసేవ, తిరుమంజనం, సహస్రనామార్చన మరియు ఇతర విశేషపూజా కార్యక్రమాలలో సుమారు 2000 మంది స్థానిక తెలుగువారు సకుటుంబ సపరివార సమేతంగా పాల్గొన్నారు. వేదమంత్రోఛ్ఛారణలతో , భక్తుల  గోవింద నామాలతో, భక్తి గీతాలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. పూజానంతరం నిర్వహించిన పంచాంగ శ్రవణాన్ని అందరూ ఆసక్తిగా ఆలకించారు. అందరికీ షడ్రచుల సమ్మిళితమై ఉగాది పచ్చడి  మరియు అన్నదాన వితరణ  జరుపబడినది. 

తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, సమాజం వారు సుమారు 3000 మంది స్థానిక తెలుగువారికి వేపపువ్వును ఉచితంగా అందించారని తెలియజేసారు. ప్రాంతీయకార్యదర్శి  అనిల్ పోలిశెట్టి  ఈ కార్యక్రమం విజయవంతం కావడం వెనుక చాలామంది సహాయ సహకారాలు అందించారని తెలిపారు. సమాజం సభ్యులకు, దాతలకు,కార్యకర్తలకు, వాలంటీర్లకు కార్యదర్శి సత్యచిర్ల ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com