ప్రవాసీయులకు ఈ ఏడు దేశాలలో బెస్ట్ లివింగ్ ...సర్వేలో వెల్లడి

ప్రవాసీయులకు ఈ ఏడు దేశాలలో బెస్ట్ లివింగ్ ...సర్వేలో వెల్లడి

మనామా:ప్రపంచ వ్యాప్తంగా వలసలు పెరగడం మామూలు విషయమై పోయింది. ఈ నేపథ్యంలో ప్రవాసీయుల  అభిప్రాయాలను తెలియజేసే  ఓ సర్వే నివేదిక వెలువడింది. వలసజీవుల అనువైన ఏడు అత్యుత్తమ దేశాల జాబితాతో కూడిన ఓ నివేదిక వెలువడింది.ఎక్స్‌పాట్ ఇన్‌సైడర్ సర్వే, ఇంటర్‌నేషన్స్ తన వార్షిక సర్వేను వెల్లడించింది. సర్వేలో భాగంగా 188 దేశాలలో నివసిస్తున్న దాదాపు 166 దేశాలకు చెందిన 13,000 మంది వలసజీవులను ప్రశ్నించింది. వివిధ వయసుల వారిని పరిగణలోకి తీసుకుని విదేశాల్లో వారి జీవితానికి సంబంధించిన 43 అంశాలపై వారిని ప్రశ్నించింది. వలసజీవులపట్ల స్థానికుల వైఖరి సానుకూలం, స్నేహ భావంగా ఉండే దేశాలలో నివసించడం ఉత్తమమని పలువురు ప్రవాసీయులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సర్వేలో పాల్గొన్న వారి అభిప్రాయం ప్రకారం వలసజీవులకు ఉత్తమమైన ఏడు దేశాల జాబితాలో .1. పోర్చుగల్, 2. తైవాన్ ,3. మెక్సికో , 4. కాంబోడియా, 5. బెహ్రయిన్, 6. కోస్టారికా, 7. ఒమన్..

పైన పేర్కొన్న దేశాల జాబితాతోపాటు యూఏఈ కూడా వలసజీవులకు మంచి గమ్యస్థానమని,ప్రవాసీయుల  పట్ల అక్కడివారి స్థానికులు సానుకూలంగా వ్యవహరిస్తారని సర్వేలో వెల్లడైంది.

Back to Top