కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్

- April 14, 2018 , by Maagulf
కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్

డిజిటల్ లావాదేవీలను ఈజీ చేయడానికి ప్రతిష్టాత్మకమైన భీమ్ యాప్ ను ప్రధాని నరేంద్రమోడీ 2016వ సంవత్సరంలో ఆవిష్కరించారు. నగదు రహిత లావాదేవీల కోసం లాంచ్‌ చేసిన ప్రభుత్వ యాప్‌ 'భీమ్‌'.  ఇప్పుడు భీమ్‌ యాప్‌ ద్వారా డిజిటల్‌ లావాదేవీలను పెంచడానికి వీరికి భారీ మొత్తంలో క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. యూపీఐ విధానం ద్వారా పనిచేసే ఈ యాప్‌లో లావాదేవీలు గణనీయంగా పడిపోయాయి. దీంతో  వినియోగదారులు లావాదేవీలు అధికంగా జరిపేందుకు ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా ఆఫర్‌తో కస్టమర్లకు నెలకు 750 రూపాయల వరకు  వ్యాపారులు ఒక నెలలో రూ.1,000 వరకు  అందించే అవకాశాన్ని కల్పిస్తోంది. అంబేడ్కర్‌ జయంతి అయిన ఏప్రిల్‌ 14నుంచి క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లను అమలు  చేయనుంది. భీమ్‌ యాప్‌ ద్వారా మెదటి సారి రూ.100  లావాదేవీ జరిపినప్పుడు  రూ.51 క్యాష్‌ బ్యాక్‌ వస్తుంది. ఇలా వినియోగదారులకు గరిష‍్టంగా రూ.750  క్యాష్‌ బ్యాక్‌ అందిస్తుంది.  అదే వ్యాపారులకయితే  ఒక నెలకు రూ.1000 వరకు పొందవచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com