పేరెంట్స్‌ కోసం ఎన్‌ఎంఎస్‌ 'యాప్‌'

పేరెంట్స్‌ కోసం ఎన్‌ఎంఎస్‌ 'యాప్‌'

న్యూ మిలీనియం స్కూల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ రవి పిళ్ళయ్‌, 'డిపిఎస్‌ బహ్రెయిన్‌' పేరుతో మొబైల్‌ యాప్‌ని అధికారికంగా ప్రారంభించారు. స్కూల్‌ యాక్టివిటీస్‌కి సంబంధించి పేరెంట్స్‌ ఈ యాప్‌ ద్వారా స్కూల్‌తో టచ్‌లో వుండడానికి వీలుంది. ఎస్సైన్‌మెంట్స్‌, సర్క్యులర్స్‌ గురించి తెలుసుకోవడం, ఫొటో గ్యాలరీ, టైమ్‌ టేబుల్‌, క్యాలెండర్‌, సిలబస్‌ వంటివే కాదు, లీవ్‌ గురించి అప్లయ్‌ చేయడానికీ ఈ యాప్‌ ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ మొబైల్‌ ఫోన్ల ద్వారా ఈ యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పేరెంట్స్‌ మరియు స్కూల్‌ మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యే దిశగా ఈ యాప్‌ ఉపకరిస్తుందని రవి పిళ్ళయ్‌ చెప్పారు. ప్రిన్సిపల్‌ అరుణ్‌కుమార్‌ శర్మ మాట్లాడుతూ, స్కూల్‌ మరియు - పేరెంట్స్‌ మధ్య ఈ యాప్‌ ఓ మీడియేటర్‌గా పనిచేస్తుందని చెప్పారు.

Back to Top