గోల్డెన్‌ ట్రెజర్‌ మోసం: ఏడుగురి అరెస్ట్‌

గోల్డెన్‌ ట్రెజర్‌ మోసం: ఏడుగురి అరెస్ట్‌

దోహా: సెక్యూరిటీ ఏజెన్సీస్‌, ఏడుగురు సభ్యుల ముఠాని అరెస్ట్‌ చేయడం జరిగింది. చారిత్రక సంపద అని చెబుతూ గోల్డ్‌ కాయిన్స్‌ని ఇస్తామని నమ్మించి, ఈ గ్యాంగ్‌ మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు వివరించారు. ఖరీదైన స్మార్ట్‌ ఫోన్స్‌ని తక్కువ ధరకే విక్రయిస్తామని కూడా ఈ ముఠా చాలామందిని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ జమాల్‌ అల్‌ కాబి మాట్లాడుతూ, సిబిఐ ఈ ముఠాకి సంబంధించిన పలు ఫిర్యాదుల్ని అందుకుందనీ, అత్యంత పకడ్బందీగా వ్యూహ రచన చేసి ఈ గ్యాంగ్‌ని అరెస్ట్‌ చేశామనీ తెలిపారు. వృద్ధులు, మహిళల్ని ఈ గ్యాంగ్‌ టార్గెట్‌గా చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ గ్యాంగ్‌లో ఆసియాకి చెందిన ఏడుగురు సభ్యులున్నారు. ఖరీదైన మొబైల్‌ ఫోన్స్‌ కావొచ్చు, బంగారు ఆభరణాలు కావొచ్చు అలాంటివి తక్కువ ధరకు లభించే అవకాశం వుండదనీ, ఎవరన్నా అలాంటి ప్రతిపాదనలు తెస్తే పోలీసులను సంప్రదించాలని సిఐడి అధికారులు సూచిస్తున్నారు.

Back to Top