అరబ్‌ మహిళతో అక్రమ సంబంధం: వ్యక్తికి 3 నెలల జైలు

అరబ్‌ మహిళతో అక్రమ సంబంధం: వ్యక్తికి 3 నెలల జైలు

అజ్మన్‌ క్రిమినల్‌ కోర్టు 23 ఏళ్ళ వయసున్న ఆసియా వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష విధించింది. శిక్ష ముగిసిన తర్వాత అతన్ని డిపోర్టేషన్‌ కూడా చేస్తారు. 39 ఏళ్ళ అరబ్‌ మహిళతో అక్రమ సంబంధం కలిగి వుండడమే ఆసియా వ్యక్తి చేసిన నేరం. కేసు వివరాల్లోకి వెళితే, అరబ్‌ మహిళతో మసాజ్‌ కోసం 200 దిర్హామ్‌లకు ఒప్పందం కుదుర్చుకున్న నిందితుడు, ఆమె వద్దకు వెళ్ళాడు. అయితే ఆమె తనతో సెక్స్‌ చేయాల్సిందిగా అతన్ని కోరింది. సెక్స్‌ అనంతరం, తనకు మసాజ్‌ చేయాల్సిందిగా నిందితుడు కోరగా, ఆమె నిరాకరించింది. దాంతో డబ్బు తిరిగిచ్చేయాలని డిమాండ్‌ చేశాడు నిందితుడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా వాగ్యుద్ధం జరిగింది. అనంతరం నిందితుడు, ఆమె మొబైల్‌ ఫోన్‌ని తీసుకుని వెళ్ళిపోయాడు. అజ్మన్‌ పోలీసులు నిందితుడ్ని అరెస్ట్‌ చేశారు. బాధితురాలు తనపై నిందితుడు చేసిన ఆరోపణల్ని ఖండించింది. 

Back to Top