యూఏఈ ట్రావెలర్స్‌కి ఎమిరేట్స్‌ ఎర్లీ బర్డ్‌ ఆఫర్‌

యూఏఈ ట్రావెలర్స్‌కి ఎమిరేట్స్‌ ఎర్లీ బర్డ్‌ ఆఫర్‌

ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్‌, స్పెషల్‌ ఎర్లీ బర్డ్‌ ఫేర్స్‌ని యూఏఈ ట్రావెలర్స్‌కి తమ గ్లోబల్‌ నెట్‌వర్క్‌లోని డెస్టినేషన్స్‌కిగాను ప్రకటించింది. నేటి నుంచి 30 ఏప్రిల్‌ వరకు అడ్వాన్స్‌గా టిక్కెట్స్‌ బుక్‌ చేసుకున్న ప్రయాణీకులకు స్పెషల్‌ ఫేర్స్‌ వర్తిస్తాయని ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌ పేర్కొంది. ఎకానమీ క్లాస్‌ ప్రయాణీకులు మిడిల్‌ ఈస్ట్‌కి వెళ్ళేందుకోసం 795 దిర్హామ్‌లనుంచి ప్రయాణించే వీలుంది. యూరోప్‌కి ఈ ధరలు 2,135 దిర్హామ్‌ల నుంచి ప్రారంభమవుతాయి. వెస్ట్‌ ఏసియా, ఇండియన్‌ ఓసియన్‌కి సంబంధించి 945 దిర్హామ్‌ల నుంచి ధరలు ప్రారంభమవుతాయి. ఫార్‌ ఈస్ట్‌, ఆస్ట్రేలియాలకు 8,895 దిర్హామ్‌ల నుంచి టిక్కెట్‌ ధరలుంటాయి. అన్ని క్లాస్‌లలోనూ ప్రయాణించే ప్రయాణీకులకు 30 కిలోలు (ఎకానమీ), 40 కిలోలు (బిజినెస్‌) బ్యాగేజీ పొందవచ్చు. 19 ఏప్రిల్‌ నుంచి 13 డిసెంబర్‌ వరకు ప్రయాణాలకు ఈ స్పెషల్‌ ఫేర్స్‌ వర్తిస్తాయి. 

Back to Top