ట్రాన్సిట్‌ ప్రయాణీకులకు యూఏఈ ఎంట్రీ వీసా

ట్రాన్సిట్‌ ప్రయాణీకులకు యూఏఈ ఎంట్రీ వీసా

మస్కట్‌: యూఏఈలోని దుబాయ్‌ లేదా అబుదాబీ మీదుగా ప్రయాణించే ట్రాన్సిట్‌ ప్రయాణీకులకు యూఏఈ ఎంట్రీ వీసాలను మంజూరు చేయనుంది. ట్రాన్సిట్‌ వీసా ద్వారా ప్రయాణీకులు యూఏఈలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్ని సందర్శించే వీలుంది. యూఏఈ క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయంతో, ట్రాన్సిట్‌ పర్యాటకులకు ఎంతో ఉపయోగకరంగా వుండనుంది. యూఏఈలో టూరిజం సెక్టార్‌ని ప్రమోట్‌ చేసేందుకు, ఎకానమీని వృద్ధి చేసేందుకు ట్రాన్సిట్‌ వీసాలకు సంబంధించి కొత్త పాలసీని క్యాబినెట్‌ అప్రూవ్‌ చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. యూఏఈ ఎయిర్‌ పోర్టుల ద్వారా 2017లో ప్రయాణించినవారిలో 70 శాతం మంది ట్రాన్సిట్‌ ప్రయాణీకులు. న్యూ పాలసీలో వీసా ఫీజు, స్టాప్‌ ఓవర్‌ విజిటర్స్‌ సంఖ్యను పెంచడం, అలాగే దేశంలోని టూరిజంని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి పేర్కొన్నారు.

Back to Top