అబ్రాలో వలసదారుల్ని ఆశ్చర్యపరిచిన షేక్‌ హమదాన్‌

అబ్రాలో వలసదారుల్ని ఆశ్చర్యపరిచిన షేక్‌ హమదాన్‌

దుబాయ్‌ క్రౌన్‌ ప్రిన్స్‌, దుబాయ్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ షేక్‌ హమదాన్‌ బిన్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌, దుబాయ్‌ క్రీక్‌లో అబ్రా రైడ్‌లో పాల్గొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. అబ్రాలో పర్యాటకుల్ని ఆయన ఆప్యాయంగా పలకరించారు. అబ్రాని నడుపుతున్న కెప్టెన్‌తో సంభాషించారు. అతని యోగక్షేమాల గురించి తెలుసుకున్న షేక్‌ హమదాన్‌, బెస్ట్‌ కెప్టెన్‌ అంటూ అభివర్ణించారు. కెప్టెన్‌ ముబాషెర్‌, షేక్‌ హమదాన్‌ తనతో మాట్లాడటం పట్ల పట్టలేని సంతోషానికి గురయ్యారు. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఈ విషయాల్ని పంచుకున్నారు షేక్‌ హమదాన్‌. 

Back to Top