కథువాపై అమితాబ్
- April 19, 2018ముంబయి : కథువాలో మైనర్ బాలికపై హత్యాచార ఘటనపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ స్పందించారు. ఈ దారుణ ఘటనపై మాట్లాడటమే బాధాకరమని బేటీ బచావో..బేటీ పఢావో ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన అమితాబ్ వ్యాఖ్యానించారు. ‘ కథువా ఘటన అత్యంత హేయం..దీనిపై మాట్లాడాలంటేనే అసహ్యం వేస్తోంది. ఇది మాటలకందని ఘోర’మని అన్నారు.
రిషీకపూర్‌తో కలిసి తాను నటించిన ‘102 నాట్అవుట్’ మూవీ సాంగ్ లాంఛ్ కార్యక్రమం సందర్భంగా అమితాబ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కథువా, ఉన్నావ్, సూరత్ అత్యాచార ఘటనలపై పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు స్పందిస్తూ మైనర్ బాలికలపై లైంగిక దాడులను తీవ్రంగా ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించి, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కథువా, ఉన్నావ్ ఘటనలు దేశవ్యాప్తంగా పెనుప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ