అమెరికాతో ఒప్పందాలా..?..ఉ.కొరియాకు ఇరాన్‌ హెచ్చరిక

- April 22, 2018 , by Maagulf
అమెరికాతో ఒప్పందాలా..?..ఉ.కొరియాకు ఇరాన్‌ హెచ్చరిక

టెహ్రాన్‌: అమెరికాతో ఏవైనా ఒప్పందాలు కుదుర్చుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి ముందడుగు వేయాలని ఇరాన్‌ ఉ.కొరియాకు సూచించింది. తమ దేశంతో ఆరు దేశాల కూటమి కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని పున్ణసమీక్షిస్తామనంటం ద్వారా అమెరికాలోని ట్రంప్‌ సర్కారు తనతో చర్చలకు సిద్ధపడే దేశాలకు ప్రమాదకర సందేశాలను పంపుతోందని ఇరాన్‌ విదేశాంగ మంత్రి జావాద్‌ జరీఫ్‌ హెచ్చరించారు. న్యూయార్క్‌లో ఐరాస జనరల్‌ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ అమెరికా తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేయటంలో విఫలమవటం మాత్రమే కాక దానిని మరింత విస్తరించాలంటోందని విమర్శించారు. ఇది ఇరాన్‌ ప్రజలకు మాత్రమే కాక ప్రపంచ దేశాలకు కూడా ప్రమాదకర సందేశమని ఆయన అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com