చైనా-భారత్‌ సంబంధాల్లో కొత్త శకం

- April 22, 2018 , by Maagulf
చైనా-భారత్‌ సంబంధాల్లో కొత్త శకం

 న్యూఢిల్లీ : చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో భారత ప్రధాని మోదీ భేటీ కానున్నారు. ఈ మేరకు చైనా పర్యటనలో ఉన్న విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటన చేశారు. ఇరుదేశాల సంయుక్త ప్రకటనలో మాట్లాడిన సుష్మా.. ఇరుదేశాల మధ్య సంబంధాలు, ద్వైపాక్షిక ఒప్పందాలపై జిన్‌పింగ్‌తో మోదీ ఈ నెల 27, 28న అనధికారికంగా వుహన్‌ నగరంలో సమావేశం అవుతారని చెప్పారు.

ఈ కీలక భేటీ ద్వారా ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న వివాదాలకు ముగింపు పలికే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఈ భేటీ అనంతరం భారత్-చైనా సంబంధాల్లో గొప్ప ముందడుగు పడనున్నట్లు అధికారులు చెబుతున్నారు. సిక్కింలోని నాథులా పాస్‌ గుండా మానస సరోవర యాత్రను తర్వలో పునఃప్రారంభించనున్నట్లు కూడా సుష్మా తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com