హైదరాబాద్ తో సిస్టర్ సిటీ అగ్రిమెంటుకు రెడీ

హైదరాబాద్ తో సిస్టర్ సిటీ అగ్రిమెంటుకు రెడీ

హైదరాబాద్‌ నగరంతో తాము సిస్టర్‌ సిటీ అగ్రిమెంట్‌ కుదుర్చుకోవడానికి సానుకూలంగా ఉన్నట్లు టెక్సాస్‌ రౌండ్‌ రాక్‌సిటీ మేయర్‌ క్రేక్‌ మోర్గాన్‌ తెలిపారు. అమెరికా టెక్సాస్‌ రాష్ట్రంలోని రౌండ్‌రాక్‌ సిటీ మేయర్‌ క్రేక్‌ మోర్గాన్‌, సిటీ మేనేజర్‌ లార్లే హార్లీలు మంగళవారం నగరమేయర్‌ బొంతు రామ్మోహన్‌ను జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో కలిశారు. హైదరాబాద్‌ నగర పర్యటనకు వచ్చిన రౌండ్‌ రాక్‌ సిటీ మేయర్‌ క్రేక్‌ మోర్గాన్‌తో పాటు పలువురు పారిశ్రామికవేత్తల బృందం నగరంలో పెట్టుబడులకు అనుకూల రంగాలపై మేయర్‌తో చర్చించారు. ప్రధానంగా ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని, మరింత అధ్యయనం చేస్తామన్నారు.

 

Back to Top