జయ సమాధి తవ్వడం తప్పదా..?

- April 26, 2018 , by Maagulf
జయ సమాధి తవ్వడం తప్పదా..?

జయలలిత తన తల్లినంటూ బెంగళూరుకు చెందిన అమృత అనే మహిళ దాఖలు చేసిన కేసు కీలక మలుపు తిరిగింది. అమృత పిటీషన్‌ ను పరిశీలించిన మద్రాస్‌ హైకోర్టు డీఏఎన్ పరీక్ష కోసం రక్తం వంటి బయాలాజికల్‌ (జీవ సంబంధిత) శాంపిల్స్ ఇవ్వాల్సిందిగా అపోలో హాస్పిటల్స్ ను ఆదేశించింది. తమ వద్ద జయలలితకు సంబంధించిన బయలాజికల్ శాంపిల్స్ ఏవీ లేవని హాస్పిటల్‌ కోర్టుకు తెలిపింది. చాలా రోజుల తరవాత హాస్పిటల్‌ దాఖలు చేసిన అఫడవిట్‌ ఇపుడు ఈ కేసులో కీలకంగా మారనుంది. ఆమెకు సంబంధించి ఎలాంటి నమూనాలు తమ వద్ద లేవని స్పష్టం చేయడంతో.. కోర్టు మున్ముందు ఇచ్చే ఆదేశాలపై ఉత్కంఠ నెలకొంది.జయ మృతికి సంబంధించి ఎలాంటి విచారణ వద్దని ఒకవైపు ఆమె అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సమాధి తవ్వి ఆమె అవశేషాలు తీసి పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు ఆదేశిస్తుందా? అన్న టెన్షన్‌ ఆమె అభిమానుల్లో నెలకొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com