మస్కట్‌:వలస మహిళ హత్య కేసులో నిందితురాలి అరెస్ట్‌

మస్కట్‌:వలస మహిళ హత్య కేసులో నిందితురాలి అరెస్ట్‌

మస్కట్‌: ఆఫ్రికాకి చెందిన ఓ మహిళను హత్య చేసిన కేసులో పోలీసులు ఒమనీ మహిళ ఒకర్ని అదుపలోకి తీసుకున్నారు. దోఫార్‌లో ఈ ఘటన జరిగింది. ఆఫ్రికన్‌ మహిళను తీవ్రంగా కొట్టి, అనంతరం ఆమెపై పెట్రోల్‌ పోసి చంపినట్లుగా నిందితురాలిపై అభియోగాలు మోపబడ్డాయి. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ - దోఫార్‌ పోలీస్‌ నిందితురాలిని అరెస్ట్‌ చేశారు. నిందితురాలు తన నేరాన్ని అంగీకరించిందని పోలీసులు చెప్పారు. నిందితురాలిని జ్యుడీషియల్‌ అథారిటీస్‌కి అప్పగించారు. తదుపరి విచారణ జరుగుతోంది. హత్యకు గల కారణాలు తెలియాల్సి వుంది. 

 

Back to Top