కర్ణాటక పరిణామాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రియాంకా

- May 15, 2018 , by Maagulf
కర్ణాటక పరిణామాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రియాంకా

కన్నడ పీఠం కోసం నాలుగు నెలల నుండి తీవ్రంగా కష్టించిన అన్ని పార్టీలకు నిన్నటి ఫలితాలు గట్టి పరీక్షనే పెట్టాయి. మొదట్లో కాంగ్రెస్. బీజేపీ పోటాపోటీగా ఉన్నా... ఆ తర్వాత బీజేపీ సంఖ్యా బలాన్ని పెంచేసుకుంది. దాంతో కాంగ్రెస్ నేతలు డైలమాలో పడ్డారు. ఏం చేసైనా సరే కర్ణాటక పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఒక దశలో బీజేపీ అనుకున్న విధంగా సీట్లు రాకపోవడంతో కాంగ్రెస్- జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. అందుకోసం స్వయంగా ప్రియాంకా గాంధీ చొరవ తీసుకొని టెన్ జనపథ్ నుండి చకచకా రాజకీయాలు నడిపారు. సీఎం పదవి జేడీఎస్‌కు ఇస్తే... బీజేపీకి అడ్డుకట్ట వేయవచ్చు.. అలా కన్నడ పీఠాన్ని దక్కించుకోవచ్చని ప్రియాంక ప్రతిపాదించారు. అనుకున్నదే తడవుగా చకచకా కుమారస్వామికి సీఎం పదవి ఆఫర్‌ చేసేయ్యడం.. అందుకు ఇరువురు ఒప్పుకోవడం జరిగిపోయాయి. అధిష్టానం దూతగా అజాద్‌ రంగంలోకి దిగి కుమారస్వామితో మాట్లాడి ఒప్పించారు.

కలిసి పనిచేద్దాం అంటూ ఇరుపార్టీల నేతలు ఒప్పేసుకున్నారు. గులాం నబీ ఆజాద్‌, అశోక్‌ గెహ్లాట్‌ బెంగళూరులోనే మకాం వేసి ఈ తతంగాన్ని నడిపించారు. ఇందులో ప్రియాంక కీలకంగా వ్యవహరించి.. ఆమె పర్యవేక్షణలోనే సర్వం నడిచినట్లు తెలుస్తోంది.

మొత్తానికి ప్రియాంక గాంధీ దేశ రాజకీయాలను ఎప్పటికప్పుడు సునిశితంగా పరిశీలించి తగు నిర్ణయాలను చకాచకా తీసుకోవడంలో చాలా మెలకువగా వ్యవహరిస్తారని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com