ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో ఉద్యోగాలు

ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో ఉద్యోగాలు

ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ వివిధ విభాగాల్లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: జనరల్‌ డ్యూటీ, జనరల్‌ డ్యూటీ (పైలట్‌), కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌.
అర్హత: జనరల్‌ డ్యూటీ విభాగాలకు 60 శాతం మార్కులతో ఇంటర్‌ (మేథ్స్‌, ఫిజిక్స్‌)తో పాటు జనరల్‌ డిగ్రీ కానీ బీఈ / బీటెక్‌ కానీ పూర్తిచేసి ఉండాలి. ఈ విభాగాలకు పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. కమర్షియల్‌ పైలట్‌ ఎంట్రీకి మొదటి శ్రేణి మార్కులతో ఇంటర్‌ (మేథ్స్‌, ఫిజిక్స్‌) ఉత్తీర్ణతతోపాటు కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ ఉండాలి. కంప్యూటరైజ్డ్‌ పైలట్‌ సెలెక్షన్‌ సిస్టం / పీఏబీటీలో ఎంపిక కానివారు, ట్రైనింగ్‌ సమయంలో ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీ నుంచి సస్పెండ్‌ అయినవారు దరఖాస్తుకు అనర్హులు. ఈ విభాగానికి మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 
వయసు: జనరల్‌ డ్యూటీ విభాగానికి 1994 జూలై 1 నుంచి 1998 జూన్‌ 30 మధ్య పైలట్‌ & సీపీఎల్‌ విభాగాలకు 1994 జూలై 1 నుంచి 2000 జూన్‌ 30 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక: అభ్యర్థులను స్టేజ్‌ 1, స్టేజ్‌ 2 ప్రక్రియల ద్వారా ఎంపిక చేస్తారు. స్టేజ్‌ 1లో అభ్యర్థుల అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసి ప్రిలిమినరీ సెలెక్షన్‌కు పిలుస్తారు. ఇందులో మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌ / కాగ్నిటివ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, పిక్చర్‌ పర్‌సెప్షన్‌, డిస్కషన్‌ టెస్ట్‌ ఉంటాయి. ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఆబ్జెక్టివ్‌ విధానంలో ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే ఉంటుంది. పీపీడీటీకి మాత్రం అభ్యర్థులు హిందీ మాధ్యమాన్ని ఎంచుకోవచ్చు. ప్రిలిమినరీ సెలెక్షన్‌లో అర్హత పొందిన వారిని స్టేజ్‌ 2 ప్రక్రియకు అనుమతిస్తారు. ఇందులో ఫైనల్‌ సెలెక్షన్‌ ఉంటుంది. దీనిలో సైకలాజికల్‌ టెస్ట్‌, గ్రూప్‌ టాస్క్‌, ఇంటర్వ్యూ (పర్సనాలిటీ టెస్ట్‌) ఉంటాయి. స్టేజ్‌ 2లో అర్హత పొందినవారికి మెడికల్‌ ఎగ్జామినేషన్‌, సీపీఎస్‌ఎస్‌ నిర్వహిస్తారు.
పదోన్నతి అవకాశం: అసిస్టెంట్‌ కమాండెంట్‌గా ఎంపికైన అభ్యర్థులు డిప్యూటీ కమాండెంట్‌, జేజీ కమాండెంట్‌, కమాండెంట్‌, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌, ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌, అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌, డైరెక్టర్‌ జనరల్‌ హోదాలో పదోన్నతి పొందే అవకాశం ఉంది.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మే 19 నుంచి
అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడింగ్‌: జూన్‌ 8 నుంచి 24 వరకు
వెబ్‌సైట్‌: www.joinindiancoastguard.gov.in

Back to Top