టీటీడీ 'శుభప్రదం'కు దరఖాస్తుల స్వీకరణ

టీటీడీ 'శుభప్రదం'కు దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్‌: తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూధర్మ పరిషత్‌ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో 7, 8, 9 తరగతుల విద్యార్థినీ విద్యార్థులకు నిర్వహించే శుభప్రదం కార్యక్రమానికి దరఖాస్తులను ఈ నెల 19వ తేదీ వరకు స్వీకరిస్తారు. 'శుభప్రదం' శిక్షణ శిబిరంలో మానవీయ విలువలు, నైతికాంశాలు, వ్యక్తిత్వ వికాసం, సనాతన ధార్మిక విషయాలు, యోగా, ధ్యానంతోపాటు పలు విషయాలపై అవగాహన కల్పిస్తారు. దరఖాస్తులు జిల్లాల్లోని హిందూ ధర్మ పరిషత్తు కార్యక్రమ అసిస్టెంట్లు, జిల్లా కేంద్ర కళ్యాణ మండపాల్లో లభిస్తాయని, టీటీడీ వెబ్‌సైట్‌ http://www.tirumala.org లో కూడా దరఖాస్తులు పొందవచ్చని ఆ సంస్థ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎంపికైన విద్యార్థులు తిరుపతిలో తమకు కేటాయించిన కళాశాలల్లో ఈ నెల 25న పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది. తరగతులను ఈ నెల 26 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పేర్కొంది. వివరాలకు 9030850336, 9849386124లో సంప్రదించాలని కోరింది.

Back to Top