Maa Gulf
న్యూ మస్కట్‌ ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌ పార్కింగ్‌ రేట్స్‌ మార్పు

న్యూ మస్కట్‌ ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌ పార్కింగ్‌ రేట్స్‌ మార్పు

మస్కట్‌: న్యూ మస్కట్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్యాసింజర్‌ టెర్మినల్‌కి సంబంధించి కొత్త పార్కింగ్‌ ఫీజులను తగ్గించారు. షార్ట్‌ టెర్మ్‌ పార్కింగ్‌ పీజుని సగానికి తగ్గించినట్లు ఒమన్‌ ఎయిర్‌పోర్ట్స్‌ పేర్కొంది. 30 నిమిషాల వరకు పార్కింగ్‌ ఛార్జిని 0.500 ఒమన్‌ రియాల్స్‌గా మార్చారు. గంట సమయానికి ఇది 1 ఒమన్‌ రియాల్‌. ఇంతకు ముందు ధరలతో పోల్చితే, సగానికి సగం రుసుముని తగ్గించడం జరిగింది. 1 గంట నుంచి 2 గంటల వరకు 2 ఒమన్‌ రియాల్స్‌ (గతంలో ఇది 3 ఒమన్‌ రియాల్స్‌), 2 నుంచి మూడు గంటల సమయానికి 3 ఒమన్‌ రియాల్స్‌ (గతంలో 4 ఒమన్‌ రియాల్స్‌ వుండేది)గా నిర్ణయించారు. 3 నుంచి 24 గంటల లోపు సమయానికి రుసుములో ఎలాంటి మార్పు చెయ్యలేదు. ఈ ధరల సవరణను పలువురు రెసిడెంట్స్‌ స్వాగతించారు.