2018-21 యూఏఈ స్కూల్‌ క్యాలెండర్‌ ప్రకటన

2018-21 యూఏఈ స్కూల్‌ క్యాలెండర్‌ ప్రకటన

పబ్లిక్‌ మరియు ప్రైవేట్‌ స్కూల్‌ క్యాలెండర్స్‌ని రానున్న మూడేళ్ళకుగాను ప్రకటించింది మినిస్టీరియల్‌ కౌన్సిల్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌. 2018-21 క్యాలెండర్‌ ఫారిన్‌ కరికులమ్‌తో నడిచే ప్రైవేట్‌ స్కూల్స్‌తోపాటు, మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ కరికులమ్‌ని ఫాలో అయ్యే ప్రైవేట్‌ మరియు పబ్లిక్‌ స్కూల్స్‌కి కూడా వర్తిస్తుంది. ఫారిన్‌ కరికులమ్‌తో నడిచే ప్రైవేట్‌ స్కూల్స్‌కి మార్జినల్‌ బ్రేక్‌ని వారానికి మించకుండా అవకాశం కల్పించారు. అయితే స్కూల్‌ ఖచ్చితంగా సంబంధిత ఎడ్యుకేషన్‌ అథారిటీ నుంచి ఆథరైజేషన్‌ పొందాల్సి వుంటుంది. మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఆలోచనలకు తగ్గట్టుగా స్కూల్‌ క్యాలెండర్‌ అప్రూవ్‌ అయ్యింది. 2018-19 సంవత్సరానికిగాను ఆగస్ట్‌ 26న టీచింగ్‌ స్టాఫ్‌ రిజాయినింగ్‌ బిగిన్‌ అవుతుందనీ, స్టూడెంట్స్‌ సెప్టెంబర్‌ 2న తిరిగి స్కూల్స్‌కి వెళతారనీ అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. వింటర్‌ బ్రేక్‌ డిసెంబర్‌ 16 నుంచి జనవరి 10 వరకు వుంటుంది. అకడమిక్‌ స్టాఫ్‌కి వింటర్‌ రెసెస్‌ డిసెంబర్‌ 23 నుంచి జనవరి 3 వరకు వుంటుంది. 

Back to Top