యూఏఈలో వర్షం: తగ్గిన ఉష్ణోగ్రతలు

యూఏఈలో వర్షం: తగ్గిన ఉష్ణోగ్రతలు

సాధారణం నుంచి ఓ మోస్తరు వర్షాలు యూఏఈలోని పలు ప్రాంతాల్లో పడుతున్నాయి. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మెటియరాలజీ (ఎన్‌సిఎం) వెల్లడించిన వివరాల ప్రకారం దుబాయ్‌, అబుదాబీలోని షామ్‌, ఖోర్‌ ఖువైర్‌, అల్‌ నఖీల్‌, ఘాలియా తదితర ప్రాంతాల్లో తేలిక పాటి వర్షం నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉమ్‌ అల్‌ కువైన్‌లోని అల్‌ రప్ఫాలో కూడా వర్షం కురిసింది. రోజంతా ఆకాశం మేఘావృతమై వుంటుందని ఎన్‌సిఎం తెలిపింది. వర్షం కారణంగా యూఏఈలో వాతావరణం ఆహ్లాదంగా మారింది. అత్యల్పంగా 17 డిగ్రీల సెల్సియస్‌ నమోదయ్యింది. ఈ వాతావరణం గురు, శుక్రవారాల్లో కూడా కొశ్రీనసాగే అవకాశముంది. సముద్ర తీర ప్రాంతాలు కొంత రఫ్‌గా వుండొచ్చు.

Back to Top