కూతురి వివాహానికి హాజరుకాలేకపోతున్న తండ్రి..మేఘన్ మనస్తాపం

కూతురి వివాహానికి హాజరుకాలేకపోతున్న తండ్రి..మేఘన్ మనస్తాపం

లాస్‌ ఏంజెల్స్‌ : బ్రిటన్‌ రాకుమారుడు ప్రిన్స్‌ హ్యారీ, హాలీవుడ్‌ నటి మేఘన్‌ మార్కెల్‌ల పెళ్లి వేడుకకు మేఘన్‌ తండ్రి థామస్‌ మార్కెల్‌ హాజరుకావడం లేదని ఒక వెబ్‌సైట్‌ పేర్కొంది. గత వారం గుండె నొప్పితో ఆస్పత్రిలో చేరిన మేఘన్‌ తండ్రి థామస్‌ను ప్రస్తుతం డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. 74 ఏళ్ల థామస్‌కు బుధవారం హార్ట్‌ సర్జరీ జరగనున్న నేపథ్యంలో ఆస్పత్రి నుంచి కదలకూడదని వైద్యులు చెప్పడంతో కూతురు పెళ్లికి హాజరుకాలేకపోతున్నారు. ప్రస్తుతం ఆయన మెక్సికోలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పెళ్లికి హాజరుకాలేకపోతున్నట్లు వెబ్‌సైట్‌ పేర్కొంది.

Back to Top