115 మంది టెర్రరిస్టులకు జైలు

115 మంది టెర్రరిస్టులకు జైలు

మనామా: జుల్ఫికర్‌ బ్రిగేడ్‌ అనే టెర్రరిస్ట్‌ సంస్థకి చెందిన 115 మంది టెర్రిస్టులకు 3 ఏళ్ళ నుంచి జీవిత ఖైదు వరకు జైలు శిక్షల్ని ఖరారు చేసింది న్యాయస్థానం. వీరి పౌరసత్వాన్ని సైతం న్యాయస్థానం రద్దు చేసింది. ఈ 115 మందిలో 53 మందికి జీవిత ఖైదు విధించారు. ముగ్గురికి 15 ఏళ్ళ జైలు శిక్ష, ఒకరికి 10 ఏళ్ళ జైలు శిక్ష, 15 మందికి ఏడేళ్ళ జైలు శిక్ష, 37 మందికి ఐదేళ్ళ జైలు శిక్షను న్యాయస్థానం ఖరారు చేసిందని చీఫ్‌ ప్రాసిక్యూటర్‌, యాక్టింగ్‌ చీఫ్‌ ఆఫ్‌ టెర్రర్‌ క్రైమ్‌ ప్రాసిక్యూషన్‌ హమాద్‌ షహీన్‌ చెప్పారు. ఈ కేసు నుంచి 23 మంది అనుమానితులకు నిర్దోషులుగా ఊరట కల్పించింది న్యాయస్థానం. 138 మంది సభ్యులతో తీవ్రవాద సంస్థను నడుపుతున్నట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. 83 మంది నిందితుల్ని వారి డిఫెన్స్‌ లాయర్స్‌ సమక్షంలో విచారించడం జరిగింది. ఇందులో ఆరుగురు మినహా మిగతావారంతా తమ నేరాన్ని అంగీకరించారు. 

Back to Top