మెడికల్‌ సెక్టార్‌లో వలస మహిళకు స్పాన్సర్‌ చేసే అధికారం లేదు

మెడికల్‌ సెక్టార్‌లో వలస మహిళకు స్పాన్సర్‌ చేసే అధికారం లేదు

మస్కట్‌: మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌కి సంబంధించిన ప్రభుత్వ, ప్రైవేట్‌ సెక్టార్‌లో పనిచేసే వలస మహిళలు తమ పిల్లలకు స్పాన్సర్‌ చేసే అవకాశం లేదని మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ జారీ చేసిన సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. తమ పిల్లల వీసాని, తమ భర్తల ఎంప్లాయర్‌ వీసాకి ట్రాన్స్‌ఫర్‌ చేయాల్సి వుంటుందని మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌కి సంబంధించిన ముఖ్య అధికారి పేర్కొన్నారు. గవర్నమెంట్‌ మరియు ప్రైవేట్‌ సెక్టార్‌లో మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ విభాగంలో పనిచేస్తున్న మహిళా వలసదారులకు ఈ సర్క్యులర్‌ వర్తిస్తుంది. మే 10న ఈ మేరకు నోటీస్‌ విడుదల చేశారు. మూడు నెలల్లోగా వీసాల మార్పు జరగాల్సి వుంటుంది. 

Back to Top