అల్‌ బురమైమీ బోర్డర్‌ ప్రారంభంతో యూఏఈ ట్రిప్‌ సులభతరం

అల్‌ బురమైమీ బోర్డర్‌ ప్రారంభంతో యూఏఈ ట్రిప్‌ సులభతరం

మస్కట్‌: ఒమన్‌ రెసిడెంట్స్‌, అల్‌ బురైమిలోని కొత్త సారా బోర్డర్‌ పాయింట్‌ ప్రారంభంతో ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. యూఏఈ వెళ్ళాలనుకునేవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా వుంటుంది. మస్కట్‌ నుంచి దఖ్లియా రోడ్‌ మీదుగా సారా బోర్డర్‌ పాయింట్‌కి 332 కిలోమీటర్లు. సారా బోర్డర్‌ నుంచి దుబాయ్‌కి 130 కిలోమీట్ల దూరం. ఇరువైపులా ఈ బోర్డర్‌లో ఆరేసి కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ బోర్డర్‌ ప్రారంభంతో రాకపోకలు చాలా స్మూత్‌గా జరిగేందుకు ఆస్కారం ఏర్పడింది. దాంతో ఒమన్‌ రెసిడెంట్స్‌ యూఏఈ వెళ్ళి రావడానికి సులభతరంగా మారిందని రాయల్‌ ఒమన్‌ పోలీసులు చెబుతున్నారు. రెసిడెంట్స్‌ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
 

Back to Top