నిపా వైరస్ సోకితే ప్రాణాలు పోతాయి జాగ్రత్త

- May 22, 2018 , by Maagulf
నిపా వైరస్ సోకితే ప్రాణాలు పోతాయి జాగ్రత్త

అప్రమత్తం చేస్తూ ఆదేశాలు
నిపా వైరస్‌ బారిన పడ్డ వారికి తొలుత శ్వాస సమస్య తలెత్తుతుంది. తలనొప్పి తీవ్రత ఎక్కువగా ఉండి క్రమంగా పదిహేను రోజుల పాటు జ్వరం వెంటాడిన పక్షంలో నిపా బారిన పడ్డట్టే. ఈ దృష్ట్యా, సరిహద్దుల్లో ఎవరైనా శ్వాస సమస్య, తలనొప్పితో బాధపడుతుంటే, తక్షణం వైద్యుల్ని సంప్రదించాలి.

మందుల్లేవు
నిఫాను కట్టడి చేయాలంటే ఎవరికీ వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. భోజనం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. పండ్లు, ఫలాలను శుభ్రం చేయకుండా తిన వద్దు. ఈ నిఫా నివారణకు మందులు లేవని, ప్రాథమిక దశలో గుర్తించిన పక్షంలో ప్రత్యేక చికిత్సతో నివారించవచ్చని వైద్యులు అంటున్నారు.

నిపా ప్రాంతానికి చెందిన రోగుల వల్లే

మలేసియాలోని నిపా ప్రాంతానికి చెందిన రోగుల నుంచి తొలిసారిగా ఈ వైరస్ ను కనుగొనడంతో దీన్ని నిపా వైర్‌సగా నామకరణం చేశారు. 2004లో బంగ్లాదేశ్‌లో కూడా ఈ వైరస్‌ ప్రబలి, మరణాలు సంభవించాయి. అనంతరం మన దేశంలో పశ్చిమ బెంగాల్‌లోని రెండు జిల్లాల్లో ఈ వైరస్‌ వెలుగుచూసింది.

14 రోజుల్లో వ్యాధి లక్షణాలు
నిపా వైరస్‌ బారిన పడిన వ్యక్తుల్లో 5 నుంచి 14 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. వ్యాధి లక్షణాలు 3-14 రోజుల వరకు ఉంటాయి. జ్వరం, తలనొప్పి, మగత, మానసిక సంతులనం తగ్గడం, శ్వాసకోశ ఇబ్బందులు, ఎన్‌సెఫలైటిస్‌, మయోకార్డైటిస్‌ వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రత ఎక్కువైతే 24 నుంచి 48 గంటల్లో కోమాలోకి వెళ్లి మృతి చెందే ప్రమాదం ఉంది. దీని నివారణకు వ్యాక్సిన్‌ లేదు. గబ్బిలం, పందులు, కోతి, పిల్లి వంటివి ఈ వైర్‌సకు వాహకాలుగా పనిచేస్తాయి.

రక్షణ చర్యలేంటి
వ్యక్తిగతంగా శుభ్రంగా ఉండటం. ఇంటితోపాటు.. ఇంటిలోని వస్తువులు శుభ్రంగా ఉంచడంతో పాటు.. మూతలు వేసివుంచడం. నీటితో శుభ్రంగా కడిగిన తర్వాతే పండ్లను ఆరగించాలి. మామిడి పండ్ల సీజన్‌లో చిన్నపిల్లల ఆరోగ్యంపై ఓ కన్నేసి ఉంచడం. గబ్బిలం, పందులు, కోతి, పిల్లి వంటి వాటికి దూరంగా ఉండాలి.

తెలుగు రాష్ట్రాల్లో

ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రాణాంతక నిపా వైరస్‌పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గబ్బిలాలను తాకడం కానీ, అవి కొరికి వదిలేసిన పండ్లను తినడం కానీ చేయరాదు. వైరస్ లక్షణాలున్న వ్యక్తికి, వారు ఉపయోగించే వస్తువులకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. మృతదేహాన్ని కూడా తాకరాదని హెచ్చరిస్తున్నారు.

బాధితుల సేవలో ప్రాణాలు కోల్పోయి..
అయితే ఆస్ట్రేలియాలో గుర్రాలకు హెండ్రా అనే వైరస్ సోకినప్పుడు అందించిన చికిత్సనే నిపా వైరస్‌కూ ప్రస్తుతం ఇస్తున్నారు.నర్స్‌గా నిపా బాధితులకు సేవలం దించిన లినీ.. చివరకు అదే వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. పెరంబరకు చెందిన లినీ తాజాగా మృతిచెందా రు. అయితే లిని భౌతికకాయాన్ని బంధువులకు అప్పగించేందుకు వైద్యులు నిరాకరించారు. వైరస్ సోకే ప్రమాదం ఉన్నందున ఎలక్ట్రానిక్ పద్ధతిలో వైద్యులే పార్థివశరీరాన్ని దహనంచేశారు. లినీని కడసారి చూసుకునేందుకు కూడా వైద్యులు అనుమతించలేదని విదేశాల నుంచి వచ్చిన ఆమె భర్త సజీశ్, పిల్లలు తెలిపారు. ఐసీయూలో చికిత్సపొందుతున్న సమయంలో లిని భర్తకు ఓ లేఖ రాశారు. నా పని అయిపోయింది. నేను మిమ్మల్ని మళ్లీచూస్తానో లేదో తెలీదు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో.. అంటూ రాసిన చివరిలేఖను చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

గబ్బిలాలు తినేసిన పళ్లు
ఫ్రూట్‌ బ్యాట్‌గా చెప్పుకునే పెట్రో పొడిడే వర్గానికి చెందిన గబ్బిలాలు నెఫా వైరస్‌ తొలి అతి థేయిలు. ఇవి కొరికి పడేసిన పండ్లు, కాయలు తింటే వైరస్‌ ఇతరులకు సోకుతుంది. పందుల రెండో అతిథేయిలు. ఆ రోగలక్షణాలతో తిరిగే పం దుల చెంత ఉంటే మనుషులు, ఇతర జంతు వులకు నిఫా వైరస్‌ సోకుతుంది. ఇది క్షణాల్లో సోకి వారం రోజుల్లో బయటపడుతుంది. ఈ కేసులో 75 శాతం మరణాలు నమోదవుతున్నాయి. ఇక ఈ రోగ లక్షణాలతో ఉన్నవారికి సమీపంలో ఉం టే ఇది వారికి కూడా సోకుతుంది. గబ్బిలాలు తిని పడేసిన బాదం, ఖర్జూరం, జామ వంటి పళ్లను తినడం వల్ల ఈ వైరస్‌ సోకుతుంది.

అప్రమత్తం చేస్తూ ఆదేశాలు
నిపా వైరస్‌ బారిన పడ్డ వారికి తొలుత శ్వాస సమస్య తలెత్తుతుంది. తలనొప్పి తీవ్రత ఎక్కువగా ఉండి క్రమంగా పదిహేను రోజుల పాటు జ్వరం వెంటాడిన పక్షంలో నిపా బారిన పడ్డట్టే. ఈ దృష్ట్యా, సరిహద్దుల్లో ఎవరైనా శ్వాస సమస్య, తలనొప్పితో బాధపడుతుంటే, తక్షణం వైద్యుల్ని సంప్రదించాలి.

మందుల్లేవు
నిఫాను కట్టడి చేయాలంటే ఎవరికీ వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. భోజనం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. పండ్లు, ఫలాలను శుభ్రం చేయకుండా తిన వద్దు. ఈ నిఫా నివారణకు మందులు లేవని, ప్రాథమిక దశలో గుర్తించిన పక్షంలో ప్రత్యేక చికిత్సతో నివారించవచ్చని వైద్యులు అంటున్నారు.

మలేసియాలో కనుగొన్నారు
అయితే నిపా వైరస్‌ దక్షిణ భారత దేశంలో కనిపించడం ఇదే తొలిసారి. ఈ ప్రాణాంతక వైరస్‌ పట్ల కేరళతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. తొలిసారిగా నిపా వైరస్ ను 1998లో మలేసియాలో కనుగొన్నారు. అప్పట్లో మలేసియాలో 105 మంది ఈ వ్యాధితో మృతి చెందారు. ఆ తర్వాత సింగపూర్‌లోనూ ఈ వైర్‌సను కనుగొన్నారు. పందులను పెంచే పశుపోషకులు ఈ వ్యాధి బారిన పడి మృతి చెందారు.

నిపా ప్రాంతానికి చెందిన రోగుల వల్లే
మలేసియాలోని నిపా ప్రాంతానికి చెందిన రోగుల నుంచి తొలిసారిగా ఈ వైరస్ ను కనుగొనడంతో దీన్ని నిపా వైర్‌సగా నామకరణం చేశారు. 2004లో బంగ్లాదేశ్‌లో కూడా ఈ వైరస్‌ ప్రబలి, మరణాలు సంభవించాయి. అనంతరం మన దేశంలో పశ్చిమ బెంగాల్‌లోని రెండు జిల్లాల్లో ఈ వైరస్‌ వెలుగుచూసింది.

14 రోజుల్లో వ్యాధి లక్షణాలు
నిపా వైరస్‌ బారిన పడిన వ్యక్తుల్లో 5 నుంచి 14 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. వ్యాధి లక్షణాలు 3-14 రోజుల వరకు ఉంటాయి. జ్వరం, తలనొప్పి, మగత, మానసిక సంతులనం తగ్గడం, శ్వాసకోశ ఇబ్బందులు, ఎన్‌సెఫలైటిస్‌, మయోకార్డైటిస్‌ వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రత ఎక్కువైతే 24 నుంచి 48 గంటల్లో కోమాలోకి వెళ్లి మృతి చెందే ప్రమాదం ఉంది. దీని నివారణకు వ్యాక్సిన్‌ లేదు. గబ్బిలం, పందులు, కోతి, పిల్లి వంటివి ఈ వైర్‌సకు వాహకాలుగా పనిచేస్తాయి.

రక్షణ చర్యలేంటి
వ్యక్తిగతంగా శుభ్రంగా ఉండటం. ఇంటితోపాటు.. ఇంటిలోని వస్తువులు శుభ్రంగా ఉంచడంతో పాటు.. మూతలు వేసివుంచడం. నీటితో శుభ్రంగా కడిగిన తర్వాతే పండ్లను ఆరగించాలి. మామిడి పండ్ల సీజన్‌లో చిన్నపిల్లల ఆరోగ్యంపై ఓ కన్నేసి ఉంచడం. గబ్బిలం, పందులు, కోతి, పిల్లి వంటి వాటికి దూరంగా ఉండాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com