బహ్రెయిన్‌లో నిపా వైరస్‌ ఎఫెక్ట్‌?

- May 26, 2018 , by Maagulf
బహ్రెయిన్‌లో నిపా వైరస్‌ ఎఫెక్ట్‌?

బహ్రెయిన్‌:భారతదేశంలోని కేరళ రాష్ట్రాన్ని నిపా వైరస్‌ కుదిపేస్తోంది. పొరుగున వున్న కర్నాటకతోపాటు, తెలంగాణలోనూ నిపా వైరస్‌ పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఈ నిపా వైరస్‌కి కారణం గబ్బిలాలేనంటూ జరుగుతున్న ప్రచారంపై కొంత గందరగోళం నెలకొంది. ఇదిలా వుంటే, బహ్రెయిన్‌లో ఫ్రూట్‌ ట్రేడర్స్‌ ఇండియా నుంచి వచ్చే పళ్ళను దిగుమతి చేసుకోవడంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. నిపా వైరస్‌కి కారణమని పేర్కొంటున్న గబ్బిలాలు, పళ్ళను తినే జాతికి చెందినవనీ, ఆ కోణంలో చూస్తే, పండ్లకు నిపా వైరస్‌ని మోసుకెళ్ళే అవకాశం వుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్న దరిమిలా, ట్రేడర్స్‌కి కొత్త అనుమానాలు కలుగుతున్నాయి. అయితే నిపా వైరస్‌ వున్న గబ్బిలాలు కొరికిన పండ్లు మాత్రమే ప్రమాదకరమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అది కూడా గబ్బిలాలతో నిపా వైరస్‌ వస్తోందనడానికి సరైన రుజువులు లేవు కాబట్టి, పూర్తిగా ఇందులో నిజం ఎంతుందనేది తేలాల్సి వుందంటున్నారు. సెంట్రల్‌ మార్కెట్‌లోని ఫ్రూట్‌ ట్రేడర్స్‌ ఆందోళన సంగతి పక్కన పెడితే, కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌ కూడా నిపా ఔట్‌ బ్రేక్‌ నేపథ్యంలో పండ్ల దిగుమతికి సుముఖత వ్యక్తం చేయడంలేదు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com