శరీరంలో 'కొవ్వు' కరిగించడం ఎలా??

- May 31, 2018 , by Maagulf
శరీరంలో 'కొవ్వు' కరిగించడం ఎలా??

శరీరంలో కొవ్వు సమస్యతో బాధపడేవారు విటమిన్‌ 'సి' పుష్కలంగా ఉండే నిమ్మకాయ రసం తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఐరన్‌ లోపంతో బాధపడేవారు తొందరగా నీరసించే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు ఎక్కువ క్యాలరీలు ఉన్న స్నాక్స్‌ తీసుకునే బదులు నిమ్మరసంతో కూడిన సలాడ్‌ తీసుకుంటే మంచిది. ఇది ఎక్కువ శక్తిని ఇవ్వడమే కాకుండా శరీరంలోని కొవ్వునూ కరిగిస్తుంది. 

మరిన్ని టిప్స్ 
వంటింట్లో అందుబాటులో ఉండే లవంగాలు, మిర్చి, దాల్చినచెక్క వంటివి కూరల్లో ఎక్కువగా వాడటం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ వేడి శరీర జీర్ణక్రియలో కొద్దిపాటి వృద్ధిని కలిగిస్తుంది. దీనివల్ల శరీరంలోని కొవ్వు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
ప్రధానంగా టమాట, కీరదోస, గుమ్మడిలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. కానీ, ఎక్కువ ఫైబర్‌ ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల ఆకలి ఎక్కువగా వేయదు. ఫైబర్‌ జీర్ణమవ్వడానికి శరీరం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల కొవ్వు సులభంగా కరిగిపోతుంది. వీటితో ఎక్కువ విటమిన్స్‌, మినరల్స్‌ శరీరానికి అందించడమే కాకుండా యాంటీ ఆక్సిడెంట్స్‌ జీర్ణక్రియను, శక్తిని పెంచుతాయని పేర్కొంటున్నారు.
బాదంపప్పు, కొబ్బరినూనె, కోడిగుడ్లు, ఆలివ్‌ ఆయిల్‌, తేనె, మజ్జిగ, వెల్లుల్లితో శరీరంలోని కొవ్వును కరిగించేందుకు ఎంతగానో దోహదపడతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com