రివ్యూ :అభిమన్యుడు

- May 31, 2018 , by Maagulf
రివ్యూ :అభిమన్యుడు

స్టార్ కాస్ట్ : విశాల్‌, సమంత, అర్జున్‌ తదితరులు..
దర్శకత్వం : పి.ఎస్‌.మిత్రన్‌
నిర్మాతలు: హరి
మ్యూజిక్ : యువన్ శంకర్ రాజా
విడుదల తేది : జూన్ 1, 2018 
 

రివ్యూ :అభిమన్యుడు

తెలుగు, తమిళం లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో విశాల్. ఈయన నుండి సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఏర్పడుతుంది. ప్రస్తుతం ఈయన విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇరుంబుతెరై' చిత్రం లో నటించాడు. తమిళనాడులో విడుదలైన ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది. ఈ మూవీ లో విశాల్ , సమంత జంటగా నటించారు..

ఇప్పుడు ఇదే చిత్రం అభిమన్యుడు పేరుతో ఈరోజు తెలుగు లో విడుదల అయ్యింది. రంగస్థలం , మహానటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత సమంత నుండి వస్తున్నా మూవీ కావడం , తమిళం లో సూపర్ హిట్ గా నిలువడం తో తెలుగులోనూ హిట్ అవుతుందనే అంచనాలు పెరిగిపోయాయి. మరి అంచనాలకు తగట్టు తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకుందా..? ఇంతకీ అభిమన్యుడు ఏం చేస్తాడు..? అసలు కథ ఏంటి అనేది..ఇప్పుడు తెలుసుకుందాం.

కథ :

తండ్రి చేసిన అప్పుల కారణంగా రోజు ఇంటి మీదకు వచ్చి అప్పుల వారు గొడవ చేస్తుంటారు. ఇది చూసిన కరుణాకర్‌(విశాల్‌).. పన్నెండేళ్లకే ఇంటి నుండి వెళ్ళిపోతాడు. మిలిటరీ ట్రైనింగ్ ఆఫీసర్‌గా జీవితం కొనసాగిస్తుంటాడు. విపరీతమైన కోపం కారణంగా కర్ణ ను ఏంగర్ మేనేజ్మెంట్‌లో సర్టిఫికేట్ తీసుకురావాలని మిలిటరీ ఆఫీసర్స్ ఆర్డర్ వేస్తారు. దానికోసం లతాదేవి (సమంత) అనే సైకియాట్రిస్ట్‌ను కలుస్తాడు కర్ణ. ఆమె ఓ నెల రోజుల పాటు కుటుంబ సభ్యులతో గడపమని సలహా ఇస్తుంది.

ఆమె సలహా మేరకు సొంతూరు వస్తాడు కర్ణ. అప్పటికే చెల్లెల్లు పెళ్లి వయసు కు వస్తుంది. చెల్లెలుకు పెళ్లి చేయాలనీ నిర్ణయించుకున్న కర్ణ..లోన్ కోసం బ్యాంకు కు వెళ్తాడు. కానీ కర్ణ కు లోన్ ఇవ్వడం కుదరదని అధికారాలు చెప్పడం తో తన తండ్రి పేరుతో ఆరు లక్షల లోన్ తీసుకుంటాడు. ఆ డబ్బు తో పాటు మరో నాల్గు లక్షలు బ్యాంకు నుండి డ్రా చేద్దామని అనుకుంటాడు. అయితే బ్యాంకులోని పది లక్షల మొత్తాన్ని ఎవరో కాజేస్తారు. చివరకు తన డబ్బును కాజేందెవరో తెలుసుకుంటాడు. తన డబ్బు మాత్రమే కాదు తనలాంటి వారు ఎంతో మంది డబ్బు పోగొట్టుకుంటారని తెలుసుకుంటాడు. ఇంతకీ ఆ డబ్బు కాజేసింది ఎవరు..? వైట్ డెవిల్‌(అర్జున్‌) కు - కరుణాకర్ ఏం సంబంధం..? అసలు వైట్ డెవిల్ ఎవరు..? అనేది తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

ప్లస్ :

* దర్శకుడు ఎంచుకున్న పాయింట్

* విశాల్ నటన

* అర్జున్ యాక్టింగ్

* సినిమా ఫొటోగ్రఫీ

మైనస్ :

* ఫస్ట్ హాఫ్

* మ్యూజిక్

నటీనటుల పెర్పామెన్స్ :

* విశాల్ ఎప్పటిలా తన నటనతో, ఫైట్స్‌తో అదరగొట్టాడు. ఇలాంటి డిఫరెంట్ చిత్రాన్ని ఎంచుకున్నందుకు హీరోగా, నిర్మాతగా విశాల్‌ ను అభినందించాలి. తన బాడీ లాంగ్వేజ్‌తో మిలిటరీ ఆఫీసర్ పాత్రలో ఇమిడిపోయారు.

* సమంత కు పెద్దగా స్కోప్ లేని రోల్. ఉన్నంత సేపు సాదా సీదాగా ఉంది. విశాల్ - సమంత మధ్య ఇంకాస్త లవ్ ట్రాక్ పెడితే బాగుండు.

* వైట్ డెవిల్ రోల్ లో యాక్షన్ కింగ్ అర్జున్ అద్భుతంగా చేసాడు. ఈ రోల్ కు సరిగ్గా అర్జున్ సెట్ అయ్యాడు. అర్జున్ - విశాల్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.

* విశాల్ తండ్రిగా నటించిన ఢిల్లీ గణేశ్ తప్ప.. సినిమాలో నటించిన వారంతా.. తమిళ నటీనటులే. ఇక వారి వారి పరిధిలో బాగానే నటించారు.

సాంకేతిక విభాగం :

* యువన్ సంగీతం పెద్దగా ఏమిలేకపోయినప్పటికీ , కథ కు తగిన బ్యాక్ గ్రౌండ్ ఇవ్వడం లో సక్సెస్ అయ్యాడు.

* సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్ గా నిలిచింది.

* రూబెన్స్ ఎడిటింగ్ పర్వాలేదు. ఈయన పనితనం ఫస్ట్ హాఫ్ లో చూపిస్తే బాగుండు.

* రాజేశ్ ఎ.మూర్తి మాటలు పెద్దగా అనిపించలేదు.

* ప్రస్తుతం స్మార్ట్ యుగం నడుస్తుంది..ఎవరి చేతులో చూసిన స్మార్ట్ ఫోన్ దర్శనం ఇస్తుంది..దీంతో ప్రపంచం మొత్తం తమ చేతుల్లో ఉండడం తో క్రైం కూడా అంతకు అంత పెరుగుతుంది. దీనినే డైరెక్టర్ మిత్రన్ ఈ మూవీ లో చూపించాడు. ఈయన ఎంచుకున్న పాయింట్ చాలా బాగుంది. డిజిటల్ క్రైమ్‌లో మనకు తెలియకుండానే ఎలా చిక్కుకుంటున్నామో కళ్లకు కట్టిచూపించారు.

మన చేతిలోని స్మార్ట్‌ఫోనే మన జీవితాన్ని మరొకడి చేతుల్లో ఎలా పెడుతుందో.. టెక్నాలజీ యుగంలో మనం ఎంత ప్రమాదపు అంచున ఉన్నమో అలర్ట్ చేస్తూ యాక్షన్ థ్రిల్లర్‌ను అందించారు దర్శకుడు. అనునిత్యం మనకు ఎదురయ్యే వాస్తవ పరిస్థితుల్ని తెరపై చూపించాడు. సైబర్ నేరగాళ్ల చేతుల్లో పడకుండా హెచ్చరించారు. డిజిటల్ క్రైమ్, సైబర్ నేరాలు బారిన పడకుండా ఇప్పుడున్న పరిస్థితిల్లో ఇలాంటి సినిమా అవసరమే.

చివరిగా :

టెక్నాలజీ తో నడవడం మంచిదే కానీ అదే టెక్నాలజీ వల్ల ప్రమాదాలు జరుగుతాయని ఈ సినిమా చెప్పుకొచ్చింది. దర్శకుడు మిత్రన్ తనదైన స్టయిల్‌లో ఈ చిత్రాన్ని హ్యాండిల్ చేశాడు. హీరో చెల్లెలు, నాన్న క్యారెక్టర్‌తో ఎమోషన్ పండించాడు. అయితే తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనేది చూడాలి. టెక్నాలజీ, హ్యాకింగ్, వంటి విషయాలు అందరికీ అర్ధమయ్యే అవకాశం లేదు కాబట్టి ఏ క్లాస్ వరకు బాగానే ఉన్న , బి , సి సెంటర్స్ లలో ఏ మేరకు ఆడుతుందనేది చూడాలి.

 

--మాగల్ఫ్.కామ్ రేటింగ్ : 3/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com