రోజుకు రూ.75 పొదుపుతో లక్షలు సంపాదించడం ఎలా?

- June 01, 2018 , by Maagulf
రోజుకు రూ.75 పొదుపుతో లక్షలు సంపాదించడం ఎలా?

మన భారత్ దేశంలో ఈక్విటీ మార్కెట్లపై ప్రజల్లో అవగాహన ఇప్పుడిప్పుడే పెరుగుతోంది.నేటికీ ఈక్విటీ మార్కెట్లంటే జూదమనే భావన ప్రజల్లో ఉంది. ఈక్విటీ మార్కెట్లను దీర్ఘకాల పెట్టుబడి సాధనాలుగా చాలా వరకు భారతీయ కుటుంబాలు భావించడం లేదు. ఈక్విటీ మార్కెట్స్ అనేవి కేవలం కచ్చితంగా రిటర్న్స్ సాధించే షార్ట్ టర్మ్ పెట్టుబడి సాధనంగానే భావిస్తున్నారు. ఇందుకు మూడు కారణాలు ఉన్నాయి. 

ఇటీవలి ఓ ఫైనాన్షియల్ ఫర్మ్ నిర్వహించిన సర్వేలో మార్కెట్లకు దూరంగా ఉన్న ప్రజలను కారణాలు అడిగి తెలుసుకోగా, మూడు ఆసక్తికరమైన కారణాలు బయటపడ్డాయి. 

1) పెట్టిన పెట్టుబడికి కచ్చితంగా రిటర్న్ రావాలనుకునే మనస్తత్వం
2) మార్కెట్లపై అవగాహన లేదని పేర్కొనడం, ట్రేడింగ్ పై నాలెడ్జి కొరత
3) చాలా మంది మార్కెట్లలో ప్రవేశించే స్థాయిలో పెట్టుబడి లేదని వాపోవడం

పై కారణాలు మనకు తరచూ తారసపడే చాలా మందిలో ఉండే భావనలే. అయితే మూడో కారణం మాత్రం నిజం కాదు. పెద్ద మొత్తంలో పెట్టుబడి ఉంటేనే మంచి రిటర్న్స్ వస్తాయనుకోవడం కేవలం అపోహ మాత్రమే. కొద్ది మొత్తాల్లో ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసికూడా పెద్ద మొత్తంలో రిటర్న్ సంపాదించవచ్చు. 

ఉదాహరణకు రోజుకు కేవలం 75 రూపాయల పెట్టుబడితో 20 సంవత్సరాల్లో రూ. 33 లక్షల సంపదను పొందే అవకాశం ఉంది. 

అది ఎలాగో చూద్దాం...
24 సంవత్సరాల ఓ యువ ఉద్యోగి నెలకు 25,000 సంపాదిస్తున్నాడు. చిన్న వయస్సులోనే ఉద్యోగం సంపాదించడంతో పెద్దగా ఖర్చులు ఉండవు. ఆ పరిస్థితుల్లో విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకునే వీలుంది. అయితే చిన్న వయస్సు నుంచే మదుపు చేయమని ఓ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఇచ్చిన సలహా అతడి జీవితాన్నే మార్చే నిర్ణయమైంది. కేవలం రోజుకు 75 రూపాయలు ఈక్విటీ ఫండ్స్ లో  ఇన్వెస్ట్ చేయడం ద్వారా 20 ఏళ్లలో రూ.33 లక్షల మొత్తం సంపాదించే వీలుందని తెలిసింది. 

నిజానికి రోజుకు 75 రోజుకు మదుపు చేస్తే నెలకు 2250 రూ.లు అవుతుంది. అలా 2250 X 12 నెలలు X 20 సంవత్సరాలు లెక్కగడితే రూ. 5.40లక్షలు మాత్రమే అవుతుంది. ఆ మొత్తానికి 15 శాతం రిటర్న్ జమకట్టినా రూ. 9లక్షలు అవుతుంది. మరి 20 సంవత్సరాలకు రూ.33 లక్షలు ఎలా అవుతాయి అనే సందేహం రావచ్చు.

అయితే 15 శాతం రిటర్న్ అనేది సీఎజీఆర్ (కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్)గా గుర్తించాలి. అంటే వార్షిక సగటు వృద్ధిరేటు  అని అర్థం. గత మూడు దశాబ్దాలుగా గమనించినట్లయితే ఈక్విటీల సీఏజీఆర్ 15 శాతం వరకూ ఉంది. అదే సమయంలో బంగారం, ఎ‌ఫ్‌డీలు, ఆర్‌డీలకు ఇంతమేర రిటర్న్స్ లేవని అర్థం చేసుకోవచ్చు. గత 10 సంవత్సరాల్లో మ్యూచువల్ ఫండ్స్ సీఏజీఆర్ 18 శాతం వరకూ ఉంది. ఈ లెక్కన మీరు మదుపు చేసిన రోజుకు 75 రూ.లు 20 ఏళ్లు గడిచే నాటికి 33 లక్షలుగా మారుతుంది.  

సంప్రదాయ పెట్టుబడులకన్నా.. ఈక్విటీలు, ఫండ్లలో మదుపు చేయడం వల్ల అధిక రాబడి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మీరు మదుపుచేసే చిన్న మొత్తం భవిష్యత్తులో ఆసరాగా మారడం కూడా సాధ్యమే. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com