రివ్యూ: ఆఫీసర్

- June 01, 2018 , by Maagulf
రివ్యూ: ఆఫీసర్

స్టార్ కాస్ట్ : నాగార్జున , మైరా సరీన్‌, అజయ్‌ తదితరులు..
దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ
నిర్మాతలు: రామ్ గోపాల్ వర్మ
మ్యూజిక్ : రవిశంకర్‌
విడుదల తేది : జూన్ 1, 2018 

రివ్యూ : ఆఫీసర్

తెలుగు చలనచిత్ర చరిత్రలో 'శివ'కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అటువంటి సంచలనాత్మక చిత్రాన్ని అందించిన కింగ్ నాగార్జున, సెన్సషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మల కలయికలో వచ్చిన చిత్రం 'ఆఫీసర్'. 'అంతం', 'గోవిందా గోవిందా' చిత్రాల తర్వాత ఈ చిత్రం రావడం తో 'ఆఫీసర్' ఫై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను అందుకోవడం లో ఆఫీసర్ సక్సెస్ అయ్యాడా..లేడా అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

నారాయణ పసారి (అన్వర్ ఖాన్ ) ముంబై లో అండర్‌వరల్డ్‌ను నామరూపాలు లేకుండా చేసిన ఘనత నారాయణకు సొంతం. అలాంటి నారాయణ ఫై కొంతమంది ఓ ఫేక్ ఎన్‌కౌంటర్ చేసాడని కేసు పెడతారు. దీంతో ఈ కేసు విచారణ చేయాల్సిన బాధ్యత హైదరాబాద్ ప్రత్యేక ఆఫీసర్ శివాజీరావ్‌(నాగార్జున)కు అప్పగిస్తారు.

దాంతో రంగం లోకి దిగిన శివాజీ రావ్ ఓ సాక్ష్యాన్ని సేకరిస్తాడు. ఆ సాక్షి ఇచ్చిన ఆధారం తో నారాయణ పసారిని అరెస్ట్ చేస్తారు. జైల్లో ఉండి నారాయణ తన పలుకుబడిని ఉపయోగించి ఆ సాక్షిని చంపిస్తాడు. దాంతో నారాయణ బయటకొస్తాడు. ఆలా బయటకొచ్చిన నారాయణ ఓ కొత్త అండర్ వరల్డ్ మాఫియా ను ముంబై లో మొదలు పెడతాడు.

ఆ అండర్ వరల్డ్ మాఫియా కు లీడర్ నారాయణ అని తెలియక పోలీస్ శాఖ, ఆ అండర్ వరల్డ్ మాఫియాను అంతం అందించే బాధ్యత నారాయణ కు అప్పగిస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది..? శివాజీ రావ్ ఫై నారాయణ పసారి ఎలా పగ తీర్చుకుంటాడు..? అండర్ వరల్డ్ మాఫియా ను శివాజి రావ్ ఎలా అంతం అందిస్తాడనేది..మీరు తెరఫై చూడాల్సిందే.

ప్లస్ :

* నాగార్జున

* బ్యాక్ గ్రౌండ్

మైనస్ :

* రొటీన్ కథ

* వర్మ డైరెక్షన్

నటీనటుల పెర్పామెన్స్ :

* శివాజీ రావ్‌ గా నాగార్జున ఆకట్టుకున్నాడు. పవర్ ఫుల్ ఆఫీసర్ గా కనిపించి అభిమానులను అలరించాడు. కథలో కొత్తదనం లేక పోవడం తో నాగ్ లోని కొత్తదనం చూడలేకపోయాం.

* నారాయణ పసారి పాత్రలో అన్వర్ ఖాన్ చాల చక్కగా చేసాడు.

* సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్ర లో మైరా సరీన్ పర్వాలేదు అనిపించింది. గ్లామర్ పరంగా కూడా పెద్దగా మార్కులు వేసుకోలేకపోయింది.

* షాయాజీ షిండే, నాగార్జున కూతురిగా నటించిన కావ్య, అజయ్ తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేసారు.

సాంకేతిక విభాగం :

* రవిశంకర్‌ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. కథ తగట్టు తన బ్యాక్ గ్రౌండ్ తో అదరగొట్టాడు.

* సాధారణం గా వర్మ సినిమాల్లో కెమెరాపనితనం గురించి చెప్పాల్సిన పనిలేదు. కథ గొప్పగా లేనప్పటికీ కెమెరా యాంగిల్స్ మాత్రం అదిరిపోతాయి. ఇక ఈ మూవీ లో కూడా ఎన్‌.భరత్‌వ్యాస్‌, రాహుల్ పెనుమత్స
సినిమా ఫొటోగ్రఫీ అదిరిపోయింది.

* సాంకేతికంగా వర్మ సినిమాలకు ఎలాగైతే ఉంటుందో ఈ సినిమాలో కూడా అదే విధంగా ఉంది. తప్ప కొత్తగా ఏమి లేదు.

* నిర్మాణ విలువలు కూడా పెద్దగా ఏమీలేవు.

* ఇక అసలు సిసలైన డైరెక్టర్ గురించి చెప్పాలంటే..సినిమా ఎంత చెత్తగా ఉన్న దానిని ప్రమోట్ చేయడం లో వర్మ దిట్ట. ఈ సినిమా ప్రమోషన్ విషయంలోనూ అలాగే చేసాడు. మరో శివ ను చూడబోతున్నారని , సరికొత్త నాగ్ ను ఈ సినిమాతో అందిస్తున్నట్లు తెగ చెప్పాడు. నాగార్జున సైతం ఈ సినిమా కథ బాగుంది , వర్మ చాల కొత్తగా తీసాడని చెప్పుకొచ్చాడు. దాంతో సినిమాను చూసేందుకు జనాలు పోటీపడడ్డారు. తీరా లోపలి వెళ్తే కానీ అసలు సినిమా కనపడలేదు.. వర్మ ఎంత రొటీన్ గా తీసాడనేది.

సినిమా కథలో కొత్తదనం లేకపోగా , ఎప్పటిలాగానే వర్మ స్టయిల్ లో సాగిపోయింది. తనకు నచ్చిన గ్యాంగ్‌స్టర్స్ మూవీ తరహాలోనే తెరెక్కించాడు. సాధారణంగా గ్యాంగ్‌స్టర్స్ మధ్య పోరాటాన్ని చూపించే వర్మ ఈసారి పోలీసుల మధ్య గొడవలు జరిగితే ఎలా ఉంటుందో చూపించాడంతే.

చివరిగా :

వర్మ - నాగ్ కాంబినేషన్ లో వచ్చిన శివ ను దృష్టిలో పెట్టుకుని సినిమాకు వెళ్తే నిరాశ పడతారు. పోలీస్ కథ అయితే రాసుకున్నాడు కానీ దానిని బలంగా చూపించలేకపోయాడు వర్మ. సన్నివేశాలను తెరకెక్కించడం , దానికి తగట్టు మాటలు రాసుకోవడం లో వర్మ విఫలం అయ్యాడు. కథలో కొత్తదనం లేకపోవడం వల్ల నాగార్జున సైతం ఏంచేయలేకపోయాడు. వర్మ చెప్పినదానికల్లా చేసుకుంటూ పోయాడు అంతే. ఇక ఈ సినిమాను చూసిన నాగ్ అభిమానులు ఈ సినిమాను ఎలా ఒప్పుకున్నాడనే సందేహం రావొచ్చు. ఓవరాల్ గా వర్మ మరోసారి ఆఫీసర్ తో నిరాశ పరిచాడు.

మాగల్ఫ్ రేటింగ్:2.25/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com