బహ్రెయిన్:పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో మినిస్ట్రీ హెల్త్‌ అలర్ట్‌

- June 02, 2018 , by Maagulf
బహ్రెయిన్:పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో మినిస్ట్రీ హెల్త్‌ అలర్ట్‌

బహ్రెయిన్:ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల నుంచి 50 డిగ్రీలకు చేరుకుంటున్న దరిమిలా, మినిస్ట్రీ హెల్త్‌ అలర్ట్‌ని జారీ చేసింది. కార్లలోంచి గాసియస్‌ సబ్‌స్టాన్సెస్‌, లైటర్స్‌, సాఫ్ట్‌ డ్రింక్స్‌, పెర్‌ఫ్యూమ్స్‌, బ్యాటరీ డివైజ్‌లను తొలగించాల్సిందిగా సూచనల్లో పేర్కొంది మినిస్ట్రీ. నీటిని అలాగే ఫ్లూయిడ్స్‌ని ఎక్కువగా తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్‌ నుంచి తప్పించుకోవచ్చని మినిస్ట్రీ పేర్కొంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు డైరెక్ట్‌ సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్‌ అవడం మంచిది కాదని మినిస్ట్రీ తెలిపింది. వాటర్‌హీటర్లను ఉపయోగించడం, ఎలక్ట్రిసిటీ మీటర్స్‌పై ప్రెజర్‌ ఎక్కువయ్యేలా వ్యవహరించడం తగదని మినిస్ట్రీ సూచించింది. పక్షులు, జంతువులకు ఉపయోగపడేలా ఫెన్సెస్‌, బాల్కనీస్‌లో నీటిని అందుబాటులో వుంచాలని పేర్కొంది మినిస్ట్రీ. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com