మస్కట్‌:మాస్క్‌ మినారెట్‌ కూలి చిన్నారికి గాయాలు

మస్కట్‌:మాస్క్‌ మినారెట్‌ కూలి చిన్నారికి గాయాలు

మస్కట్‌: హలాత్‌ అల్‌ ఖహైల్‌ మాస్క్‌కి సంబంధించిన ఓ మినారెట్‌ కూలడంతో 12 ఏళ్ళ చిన్నారి గాయపడ్డాడు. కోస్టల్‌ టౌన్‌ సహామ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అల్‌ బతినా గవర్నరేట్‌లో వుంది ఈ ప్రాంతం. ఈ ఘటనలో చిన్నారి మెదడుకి గాయమయ్యింది. ప్రస్తుతం గాయపడ్డ చిన్నారికి పెడియాట్రీషియన్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో వైద్య చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగానే వున్నా, నిలకడగా వున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో మాస్క్‌ని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Back to Top