తగ్గిన బంగారం ధర!

తగ్గిన బంగారం ధర!

క్రమంగా పసిడి ధరలు కిందకి దిగొస్తున్నాయి. వరుసగా రెండోరోజు బంగారం ధరలు తగ్గాయి.. రూ.150 రూపాయలు ధర తగ్గిన 10 గ్రాముల బంగారం ధర 31,800 రూపాయలుగా నమోదైంది. అలాగే కేజీ వెండి ధర రూ.1,110 పెరిగి రూ.41,560గా నమోదైంది. దీనికి కారణం స్థానిక జువెల్లర్స్‌ నుంచి డిమాండ్‌ అంతగా లేకపోవడంతో బంగారం ధరలు మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతున్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇదిలావుంటే మంగళవారం  అమెరికా-ఉత్తరకొరియా మధ్య చర్చలు సఫలమవడంతో క్రమంగా డాలర్‌ బలపడుతోంది. యెన్‌తో పోలిస్తే అమెరికా డాలర్‌ మూడు వారాల గరిష్టానికి చేరింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు కిందకి పడిపోతున్నాయి.

Back to Top